- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రైవేటు స్కూళ్లకు రేవంత్ సర్కార్ వార్నింగ్..ర్యాంకులు ప్రకటిస్తే గుర్తింపు రద్దు
తెలంగాణ ప్రభుత్వం(Telangana) పదవతరగతి ఫలితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం(Telangana) పదవతరగతి ఫలితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. రిజల్ట్ వచ్చిందంటే చాలు ప్రైవేటు పాఠశాలలు(Private schools) ర్యాంకుల మోత మోగించినట్టు ప్రచారం మొదలు పెడతాయి. ఒకటి..ఒకటి..ఒకటి, రెండు, రెండు రెండు అంటూ టీవీల్లో పేపర్లలో యాడ్స్ ఇస్తుంటాయి. అయితే అలాంటివి చేస్తే చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. ర్యాంకులు ప్రకటిస్తే స్కూల్ గుర్తింపు రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది.
జీవో ఎం.ఎస్ నంబర్.145 ప్రకారం 1997-98 నుండి ర్యాంకులను ప్రకటించడం లేదని తెలిపింది. ఏ మేనేజ్మెంట్ లేదా సంస్థ అయినా ఈ ఉత్తర్వులు ఉల్లంఘించి ర్యాంకులు ప్రకటిస్తే చట్ట ప్రకారం వాటి గుర్తింపు రద్దు చేసే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ర్యాంకులు ప్రకటించడం వల్ల తక్కు మార్కులు వచ్చిన విద్యార్థుల తల్లి దండ్రులు వారిని మందలించే అవకాశం ఉంది. వ్యాపారం కోసం స్కూళ్లు చేసే ప్రకటనల వల్ల విద్యార్థులు మానసిక ఆందోళన చెందే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.






