జులై 15 నుంచి ఉద్యోగుల ఆరోగ్య పథకం ప్రారంభం

by Naga Rani Yarlagadda |

జులై 15వ తేది నుంచి ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని ప్రారంభించాలని సీఎస్ కె.రామకృష్ణారావు అధ్యక్షతన శనివారం జరిగిన ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ బోర్డు తొలి సమావేశం నిర్ణయించింది.

జులై 15 నుంచి ఉద్యోగుల ఆరోగ్య పథకం ప్రారంభం
X
  • ఈహెచ్సీటీ బోర్డు నిర్ణయం

దిశ, తెలంగాణ బ్యూరో: జులై 15వ తేదీ నుంచి ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని ప్రారంభించాలని సీఎస్ కె.రామకృష్ణారావు అధ్యక్షతన శనివారం జరిగిన ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ బోర్డు తొలి సమావేశం నిర్ణయించింది. వారం రోజుల్లో సమగ్రమైన నిబంధనలు విడుదల చేయనున్నట్టు సీఎస్ ప్రకటించారు. భార్య, భర్తల్లో ఒకరి నుంచి మాత్రమే చందా మినహాయించాలని నిర్ణయించారు. అదనంగా మినహాయించిన మొత్తం తిరిగి చెల్లించడానికి ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు బోర్డు చైర్మన్ సీఎస్ కె.రామకృష్ణారావు తెలిపారు. దీంతోపాటు వారం రోజుల్లో హాస్పిటల్ యాజమాన్య ప్రతినిధులతో ఆరోగ్య శాఖ అధికారులు, ట్రస్ట్ సభ్యుల సమావేశం నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఈహెచ్ఎస్ నిబంధనలనే పాటించడంతో పాటు ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసుకుని నిబంధనల్లో మార్పులు చేయాలని సమావేశం నిర్ణయించింది. వీటితో పాటు ప్యాకేజి రేట్లు, హాస్పిటల్స్ జాబితా ఫైనల్ చేయాలని సమావేశం నిర్ణయించింది.

Next Story