గురుకులాల్లో విద్యార్థులు100% ఉత్తీర్ణత సాధించాలి.. బీసీలు అన్ని రంగాల్లో ముందు ఉండాలి : మంత్రి వాకిటి శ్రీహరి

by Naga Rani Yarlagadda |

తెలంగాణ ప్రభుత్వం బీసీ విద్యార్థుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు, పోటీ ప్రపంచానికి తగిన అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

గురుకులాల్లో విద్యార్థులు100% ఉత్తీర్ణత సాధించాలి.. బీసీలు అన్ని రంగాల్లో ముందు ఉండాలి : మంత్రి వాకిటి శ్రీహరి
X
  • గురుకులాల్లో విద్యార్థులు100% ఉత్తీర్ణత సాధించాలి.. బీసీలు అన్ని రంగాల్లో ముందు ఉండాలి : మంత్రి వాకిటి శ్రీహరి

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం బీసీ విద్యార్థుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు, పోటీ ప్రపంచానికి తగిన అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. 2 లక్షలకు పైగా విద్యార్థులు బీసీ గురుకులాల్లో, హాస్టల్ లలో చదువుతున్నారని, 98 శాతం పైన ఉత్తీర్ణులు అయ్యారన్నారు. బంజారాహిల్స్ లోని కొమురంభీం భవన్ లో గురువారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని బీసీ గురుకుల హాస్టల్ కు చెందిన విద్యార్థులు పదో తరగతి, ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రతిభా పురస్కారాలు ప్రధాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గురుకులాల్లో, హాస్టల్ లలో బలహీన వర్గాల బిడ్డలు చదువుతున్నారని, వారికి డైట్ కాస్మొటిక్ చార్జీలు పెంచామని, అధ్యాపక బృందానికి ప్రమోషన్ల, బదిలీలు చేపట్టామన్నారు. కొత్తగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టామని, రాబోయే పోటీ ప్రపంచంలో బలహీన వర్గాల గురుకులాల, హాస్టల్ ల నుండి వచ్చిన విద్యార్థులు పోటీ ప్రపంచంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని పొన్నం ప్రభాకర్ తెలిపారు.

తమ పాఠశాలల్లో ఉన్న అధ్యాపక వర్గంపై విశ్వాసం ఉందని, వచ్చే సంవత్సరం మరిన్ని ర్యాంకులు సాధించాలి. తమ బీసీ గురుకుల ర్యాంకులు అని ప్రచారం చేసుకుంటామన్నారు. విద్యార్థులు పెద్ద లక్ష్యంగా యూపీఎస్సీల టార్గెట్ గా చదవాలని మంత్రి సూచించారు. విద్యార్థి సంఘాల ఎన్నికలు లేకుంటే తాను మంత్రి అయ్యేవాడిని కాదని, ఇటీవల విద్యా కమిషన్ విద్యార్థి సంఘాల ఎన్నికలు జరపాలని చెప్పిందన్నారు. 98 శాతం పైగా మార్కులు ఉంటే పోటీ చేసే అవకాశాలు ఇవ్వాలని పొన్నం ప్రభాకర్ చెప్పారు. 2025-26 విద్యా సంవత్సరానికి చెందిన 508 మంది ప్రతిభావంతులైన విద్యార్థులను సన్మానిస్తున్నామన్నారు. మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు ఈసారి పదవ తరగతి ఫలితాల్లో ఫలితాల్లో చరిత్ర సృష్టించాయని, 19,243 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా.. 19,048 మంది ఉత్తీర్ణులై 98.99% ఉత్తీర్ణత నమోదు చేశారని, రాష్ట్ర సగటు 95.15% అని మంత్రి పొన్నం చెప్పారు. 204 విద్యాసంస్థలు 100% ఫలితాలు సాధించాయని, 10 జిల్లాల్లో 100% ఉత్తీర్ణత నమోదైందని ఆయన తెలిపారు. 980 మార్కులకు పైగా 496 మంది సాధించారని, 950 మార్కులకు పైగా 2106 మంది సాధించారన్నారు. 900 మార్కులకు పైగా 4183 మంది విద్యార్థులు సాధించడం విశేషమని మంత్రి పొన్నం ప్రశంసించారు. ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరంలో 33 విద్యాసంస్థలు 100% ఫలితాలు సాధించగా, మొదటి సంవత్సరంలో 08 విద్యాసంస్థలు 100% ఫలితాలు సాధించాయన్నారు.

ఇంటర్ మొదటి సంవత్సరంలో 4286 మంది పరీక్షలకు హాజరుకాగా, 2213 మంది ఉత్తీర్ణులై 51.63% ఫలితాలు సాధించారని మంత్రి పొన్నం చెప్పారు. దీనిలో 904 మంది A గ్రేడ్ సాధింంచారన్నారు. ఇంటర్ రెండవ సంవత్సరంలో 3353 మంది పరీక్షలకు హాజరుకాగా, 2409 మంది ఉత్తీర్ణులై 71.85% ఫలితాలు నమోదు చేశారన్నారు. వీరిలో 1180 మంది A గ్రేడ్ సాధించడం చాలా గొప్ప విషయమని మంత్రి పొన్నం తెలిపారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ గురుకులాల్లో అన్ని వసతులు కల్పిస్తున్నందున 100% ఉత్తీర్ణత సాధించాలని, అన్ని రంగాల్లో బీసీలు ముందుండాలన్నారు. విద్యారంగంలో ఒత్తిడి ఉండొద్దని 25 వేల మంది టీచర్లకు బదిలీలు, ప్రమోషన్లు ఇచ్చామని, అవకాశాన్ని సృష్టించుకున్నవాళ్లే సమర్ధులు అవుతారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యారంగంలో విప్లవాత్మకంగా మార్పులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారని మంత్రి వాకిటి శ్రీహరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, బీసీ డెడికేషన్ కమిషన్ చైర్మన్ బి. వెంకటేశ్వర్లు, రాజ్య సభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, బీసీ సంక్షేమ శాఖ సెక్రటరీ బాలమయాదేవి, ఎంజేపి సెక్రటరీ సైదులు, బీసీ కమిషన్ సభ్యులు, బీసీ సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story