- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గిరిజనులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
by Ajay Maddhiboyina |
గిరిజనులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇందిరా సౌర గిరి జల వికాస పథకాన్ని ఈ నెల18న ప్రారంభిస్తామని ప్రకటించింది.

X
దిశ, వెబ్ డెస్క్: గిరిజనులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇందిరా సౌర గిరి జల వికాస పథకాన్ని ఈ నెల18న ప్రారంభిస్తామని ప్రకటించింది. సీఎం రేవంత్ రెడ్డి అమ్రాబాద్‌లోని మాచారంలో ఈ పథకాన్ని ప్రారంభిస్తారని వెల్లడించింది. పథకం కోసం ఐదేళ్లలో రూ.12,600 కోట్లను కేటాయించబోతున్నట్టు ప్రకటించింది. ఈ పథకం ద్వారా గిరిజన రైతులకు చెందిన 6 లక్షల ఎకరాలకు సౌర విద్యుత్ ద్వారా సాగునీటిని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది. ఇదిలా ఉంటే ఈ పథకం ద్వారా 2 లక్షలకు పైగా గిరిజనులకు లబ్ధి చేకూరనుంది. ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు ఉన్న గిరిజన రైతులకు ఈ పథకం వర్తించనుంది. ఈ పథకం అమలులో ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్లు, విద్యుత్తు, ఉద్యానవన శాఖ అధికారుల పాత్ర కీలకంగా ఉండనుంది.
Next Story






