సీఎం కేసీఆర్ కు గవర్నర్ తమిళి సై స్ట్రాంగ్ కౌంటర్

by Javid Pasha |   (  Updated:2023-01-19 13:28:43  IST  )

సీఎం కేసీఆర్ పై రాష్ట్ర గవర్నర్ తమిళి సై మరోమారు ఫైర్ అయ్యారు.

సీఎం కేసీఆర్ కు గవర్నర్ తమిళి సై స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్ పై రాష్ట్ర గవర్నర్ తమిళి సై మరోమారు ఫైర్ అయ్యారు. ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో గవర్నర్ వ్యవస్థపై సీఎం కేసీఆర్ చేసిన విమర్శలకు తమిళి సై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు రాజ్ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడిన గవర్నర్.. ఖమ్మం సభలో సీఎం కేసీఆర్ గవర్నర్ వ్యవస్థను అవమానించారని ఆరోపించారు. గవర్నర్లపై సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు సరికాదని అన్నారు. గవర్నర్ వ్యవస్థను కేసీఆర్ ఎలా అవహేళన చేస్తారని ప్రశ్నించారు. తాను 25 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్నానని, కానీ ఏనాడు ఇలాంటి పరిస్థితిని చూడలేదని చెప్పారు. రిపబ్లిక్ డే పై తనకు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందలేదని తెలిపారు. ఇక ప్రొటోకాల్ అంశంపై ప్రభుత్వం స్పందించాకే ప్రభుత్వ ప్రశ్నలకు సమాధానమిస్తామని స్పష్టం చేశారు.

Next Story