- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. సీసీ కెమెరాల నిర్వహణకు స్పెషల్ టీమ్ ఏర్పాటు
తెలంగాణ (Telangana) రాష్ట్ర శాంతిభద్రతల విషయంలో సీసీ కెమెరాలు (CC Cameras) ప్రధాన భూమిక పోషిస్తున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana) రాష్ట్ర శాంతిభద్రతల విషయంలో సీసీ కెమెరాలు (CC Cameras) ప్రధాన భూమిక పోషిస్తున్న విషయం తెలిసిందే. 2016 తర్వాత హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని ప్రధాన జిల్లా కేంద్రాల్లో 6 లక్షలకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దీంతో చోరీలు, దొంగతనాలు, ముఠా దాడులు, మహిళలపై నేరాలు గణనీయంగా తగ్గాయి. ఫలితంగా బెస్ట్ పోలీసింగ్‌లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం హైదరాబాద్ నగర పరిధిలో సీసీ కెమెరాల నిర్వహణకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసింది. వారికి వాహనాలు, క్రేన్లు, ఇతర సామగ్రి కూడా సమకూర్చారు. ఆ బృందాలకు పోలీసులు ‘ఎంపవరింగ్ ఎవ్రీడే సేఫ్టీ టీమ్స్’గా నామకరణం చేశారు. ఈ టీమ్స్ నగరంలో సీసీ కెమెరాలను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ.. కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానంగా పని చేయనున్నాయి.
మరోవైపు ITMS (Integrated Traffic Management System) ద్వారా వెయ్యికి పైగా ప్రధాన జంక్షన్లలో AI ఆధారిత కెమెరాలు అమర్చడంతో హెల్మెట్, సీట్ బెల్ట్ లేకుండా, సిగ్నల్ దాటినా వాహనాలకు ఆటోమేటిగ్గా చలాన్లు పడుతున్నాయి. కేవలం 2024లో మాత్రమే 1.5 కోట్లకు పైగా ఈ-చలాన్లు పంపారు. దీంతో రోడ్డు ప్రమాదాలు, హిట్ అండ్ రన్ కేసులు గణనీయంగా తగ్గాయి. అదేవిధంగా సీసీ కెమెరాలతో షీ టీమ్స్ (She Teams)కు మహిళలపై వేధింపులు, స్టాకింగ్ నివారణలో అత్యంత కీలకంగా మారాయి. ముఖ్యంగా బస్టాండ్లు, మెట్రో స్టేషన్లు, మాల్స్, పబ్లిక్ ప్లేసెస్‌లో 24 గంటల పాటు మానిటరింగ్ ఉంటుంది.






