- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. వరద సాయం కింద రూ.200 కోట్లు మంజూరు
ఇటీవల కురిసిన భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి.

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కురిసిన భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. వరదలతో ఆయా జిల్లాల్లో ప్రధాన రహదారులు, భవనాలు, చెరువులు, కుంటలు ధ్వసమయ్యాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సర్కార్ (Telangana Government) కీలక నిర్ణయం తీసుకుంది. వరదసాయం కింద పలు జిల్లాలకు తక్షణ సాయం కింద రూ.200 కోట్లు నిధులు మంజూరు చేశారు. భారీ వర్షాలు, వరదలతో తీవ్ర నష్టం వాటిల్లిన 7 జిల్లాలకు గాను రూ.10 కోట్లు, సాధారణ నష్టం వాటిల్లిన 26 జిల్లాలకు గాను రూ.5 కోట్ల చొప్పున నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు సీఎస్ రామకృష్ణా రావు (CS Rama Krishna Rao) అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌లో కామారెడ్డి, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టర్లతో మాట్లాడిన విషయం తెలిసిందే. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేయాలని, పరిహారాలను వెంటనే విడుదల చేయాలని వారికి సూచించారు. భవిష్యత్తులో రాబోయే అకాల వర్షాలు, వరదలతో తరచూ సంభవించే ప్రమాదమున్న నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.






