- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. మేడారం జతరకు రూ.150 కోట్లు మంజూరు
తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ఆసియాలోనే అతిపెద్ద మేడారం (Medaram) సమ్మక్క సారలమ్మ జాతరకు రూ.150 కోట్లు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ పాలనాపరమైన అనుమతులిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభమై 31న ముగియనుంది. ఈ మేరకు తాజాగా మంజూరైన నిధులతో భక్తులు, వీఐపీల కోసం రూ.5 కోట్లతో గెస్ట్ హౌస్ నిర్మాణం చేపట్టనున్నారు. ఇప్పటికే నాలుగునూట్ల గెస్ట్ హౌస్ నిర్మాణానికి ఆర్ అండ్ బీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ (Vikas Raj) అనుమతులు ఇచ్చారు. కాకతీయ రాజుల కాలం నుంచి కొనసాగుతూ వస్తున్న ఈ జాతరకు కోటి మందికి పైగా భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు (Better facilities) కల్పించే దశగా రేవంత్ సర్కార్ ప్రణాళికలు రూపొందిస్తోంది.






