తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. భారీగా డిప్యూటీ కమిషనర్ల బదిలీలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-11 02:22:16  IST  )

తెలంగాణ సర్కార్ (Telangana Government) మరో కీలక నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. భారీగా డిప్యూటీ కమిషనర్ల బదిలీలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సర్కార్ (Telangana Government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలోని మొత్తం 23 మంది డిప్యూటీ కమిషనర్లను బదిలీ చేసింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ (RV Karnan) ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, పలువురికి ప్రమోషన్లతో పాటు కొత్తగా పోస్టింగ్ ఇచ్చారు. ఖైరతాబాద్ సర్కిల్‌‌కు గాను జయంత్‌‌ను డిప్యూటీ కమిషనర్‌గా నియమించగా, యూసఫ్‌గూడ సర్కిల్‌లో రజనీకాంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. మల్కాజ్‌గిరి డిప్యూటీ కమిషనర్‌‌గా జకియా సుల్తానా, చందానగర్‌‌కు శశిరేఖ, ఉప్పల్‌‌కు రాజులను నియమించారు. ఇక సికింద్రాబాద్ డిప్యూటీ కమిషనర్‌గా ఆంజనేయులు, గోషామహల్‌‌కు ఉమా‌ప్రకాష్, రాజేంద్రనగర్‌‌కు రవికుమార్, ఎల్బీ నగర్‌‌కు మల్లికార్జున రావు, హయత్‌‌నగర్‌‌ సర్కిల్‌కు గాను వంశీకృష్ణ బాధ్యతలు చేపడతారు. మూసాపేట్ డిప్యూటీ కమిషనర్‌గా సేవా ఇస్లావత్, బేగంపేట్‌‌కు డాకు నాయక్‌ డిప్యూటీ కమిషనర్‌గా నిమమితులయ్యారు.

Next Story