- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: స్థానిక ఎన్నికలపై సర్కార్ కీలక నిర్ణయం!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది.

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు(Local Body Elections), బీసీ రిజర్వేషన్లు వంటి పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల(BC Reservations) ఆర్డినెన్స్ విషయంలో జరుగుతున్న జాప్యంపై ప్రదానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై రాష్ట్రపతిని కలవాలని నిర్ణయించినట్లు సమాచారం. రిజర్వేషన్ల అంశం కొలిక్కి వచ్చిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, బీసీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించిన ఆర్డినెన్స్ ప్రస్తుతం కేంద్ర హోంశాఖ వద్ద పెండింగ్ ఉంది. మరోవైపు రిజర్వేషన్ల ఖరారుపై హైకోర్టు ఇచ్చిన గడువు పూర్తయింది. ఏడాదిన్నరకు పైగా స్థానిక ఎన్నికలు జరగక కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయి. వీటన్నింటి నేపథ్యంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై మంత్రివర్గం చర్చించినట్టు తెలుస్తోంది.






