అంగన్వాడీలకు కోడిగుడ్ల సరఫరాపై ప్రభుత్వం కీలక నిర్ణయం

by Ajay Maddhiboyina |   (  Updated:2025-07-05 16:59:48  IST  )

రాష్ట్రంలోని ప్రభుత్వ సంస్థల్లో గుడ్ల సేకరణ, సరఫరా విషయంలో పారదర్శకత, ఏకరూపతను తీసుకురావడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

అంగన్వాడీలకు కోడిగుడ్ల సరఫరాపై ప్రభుత్వం కీలక నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ సంస్థల్లో గుడ్ల సేకరణ, సరఫరా విషయంలో పారదర్శకత, ఏకరూపతను తీసుకురావడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గుడ్ల సేకరణ, సరఫరాకు సంబంధించి నూతన మార్గదర్శకాలను విడుదల చేస్తూ సీఎస్ రామక్రుష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా జిల్లా కొనుగోలు కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నూతన మార్గదర్శకాలు ప్రధానంగా అంగన్‌వాడీ కేంద్రాలు, నివాస సంక్షేమ సంస్థలు (హాస్టళ్లు), గురుకులాలకు గుడ్ల సరఫరాకు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సంస్థలకు సరఫరా చేయబడే గుడ్లలో ఏకరీతి నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, టెండర్ షరతులను కూడా ఒకే విధంగా అనుసరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనివల్ల గుడ్ల నాణ్యతలో ఎటువంటి రాజీ లేకుండా, అన్ని సంస్థలకు ఒకే రకమైన ప్రమాణాలతో కూడిన గుడ్లు అందనున్నాయి. అయితే, ఈ మార్గదర్శకాల నుండి హాస్టళ్లు, మధ్యాహ్న భోజన పథకాన్ని మినహాయించారు. ఈ పథకాలకు గుడ్ల సరఫరాకు సంబంధించి ప్రస్తుతమున్న నిబంధనలే కొనసాగుతాయని ప్రభుత్వం పేర్కొంది.

Next Story