SLBC పూర్తికి తెలంగాణ ప్రభుత్వం డెడ్‌లైన్‌

by Gantepaka Srikanth |

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) పనుల పునరుద్ధరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.

SLBC పూర్తికి తెలంగాణ ప్రభుత్వం డెడ్‌లైన్‌
X

దిశ, వెబ్‌డెస్క్: ఎస్‌ఎల్‌బీసీ(SLBC) పనుల పునరుద్ధరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో అధికారులతో పాటు మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాట్లాడారు. SLBC తెలంగాణకు అత్యంత కీలకం అని చెప్పారు. పనులు ఆలస్యం కావడానికి వీలులేదని సూచించారు. 2027 డిసెంబర్‌ 9లోగా SLBC పూర్తి చేయాలని ఆదేశించారు. అటవీశాఖ అనుమతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. SLBCకి నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. సొరంగం తవ్వకంలో సింగరేణి నిపుణుల సేవలు వాడుకోవాలని సూచించారు. నిరంతరం విద్యుత్ సరఫరా జరగాలని సీఎం రేవంత్ అన్నారు. కాంట్రాక్టర్‌ ఒక్క రోజు పనులు ఆలస్యం చేసినా ఊరుకునేది లేదని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. శ్రీశైలం నుంచి అక్కంపల్లి రిజర్వాయర్‌ వరకు ఉన్న సమస్యలపై తక్షణమే సమాచారం ఇవ్వాలని అన్నారు.

Next Story