- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG News : కంచ గచ్చిబౌలి భూములపై కేంద్ర కమిటీకి తెలంగాణ ప్రభుత్వం నివేదిక
దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసిన కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం(Kancha Gachibouli Land Issue)పై సుప్రీంకోర్టు(Supreme Court) ఏర్పాటు చేసిన పర్యావరణ, కేంద్ర అటవీశాఖల సాధికారిక కమిటీ(Supreme Court Empowered Committee) నేడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU)లోని భూములను పరిశీలించారు.

దిశ, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసిన కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం(Kancha Gachibouli Land Issue)పై సుప్రీంకోర్టు(Supreme Court) ఏర్పాటు చేసిన పర్యావరణ, కేంద్ర అటవీశాఖల సాధికారిక కమిటీ(Supreme Court Empowered Committee) నేడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU)లోని భూములను పరిశీలించారు. కాగా కేంద్ర కమిటీతో తెలంగాణ ప్రభుత్వ అధికారులు భేటీ అయ్యారు. 400 ఎకరాల భూమిపై ప్రభుత్వం తన పూర్తి నివేదికను కమిటీకి అందజేసింది. కాగా TGIIC ఈ భూములను స్వాధీనం చేసుకునే నేపథ్యంలో జరిగిన వివాదం సుప్రీంకోర్టుకు చేరిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నివేదిక అందజేయాలని సుప్రీంకోర్ట్ కేంద్ర సాధికారిక కమిటీని నియమించింది.
కమిటీ ఛైర్మన్ సహ సభ్యులు నేడు కంచ గచ్చిబౌలికి చేరుకొని.. వాస్తవ పరిస్థితులను పరిశీలించారు. అనంతరం కమిటీతో ప్రభుత్వ అధికారుల సమావేశం అయ్యి.. తమ నివేదికను అందజేశారు. అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యే హరీష్ రావు, బీజేపీ తరపున ఈటల రాజేందర్ కమిటీని కలిసి తమ నివేదికను అందజేశారు. ఇక వర్శిటీ విద్యార్థులు, ఉపాధ్యాయ జేఏసీ, పౌర సంఘాలతో కమిటీ రేపు సమావేశం కానుంది.






