సద్దుల బతుకమ్మ పండుగ తేదీ పై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన

by Malleboina Mahesh |   (  Updated:2025-09-28 03:20:17  IST  )

సద్దుల బతుకమ్మ పండుగ తేదీలపై ప్రస్తుతం కొంత గందరగోళ వాతావరణం నెలకొంది. "ఈ నేపథ్యంతో బతుకమ్మ పండుగ తేదీ పై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.

సద్దుల బతుకమ్మ పండుగ తేదీ పై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ (Bathukamma festival)కు ఎంతో ప్రాముఖ్యం ఉంది. ప్రకృతి అందాలను, పూల సౌందర్యాన్ని, స్త్రీశక్తి స్ఫూర్తిని కలిపిన ఈ పండుగలో మహిళలు సమిష్టిగా చేరి పూలతో అలంకరించిన బతుకమ్మ చుట్టు తిరుగుతు నర్తిస్తూ, పాడుతూ ఆరాధిస్తారు. ఇది కేవలం పూల పండుగ మాత్రమే కాకుండా సమాజంలోని ఐక్యత, సౌభ్రాతృత్వం, స్త్రీల గౌరవాన్ని ప్రతిబింబించే వేడుకగా నిలుస్తుంది. అయితే సద్దుల బతుకమ్మ పండుగ (Saddula Bathukamma) ఎప్పుడు నిర్వహించుకుకోవాలనే సందిగ్ధం రాష్ట్ర ప్రజల్లో ఏర్పడింది. లెక్కల ప్రకారం తొమ్మిదో రోజు అయిన సెప్టెంబర్ 29 సోమవారం రోజున సద్దుల బతుకమ్మను నిమజ్జనం చేయాలని కొందరు అర్చకులు చెబుతున్నారు.

మరోవైపు సెప్టెంబర్ 30న సద్దుల బతుకమ్మ నిర్వహించాలని మరికొందరు సూచిస్తున్నారు. దీంతో సద్దుల బతుకమ్మ పండుగ తేదీలపై ప్రస్తుతం కొంత గందరగోళ వాతావరణం నెలకొంది. "ఈ నేపథ్యంతో బతుకమ్మ పండుగ తేదీ పై తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కీలక ప్రకటన చేసింది. ఈనెల 30వ తేదీ మంగళవారం (Tuesday the 30th) రాష్ట్ర వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ పండుగను జరుపుకోవాలని అధికారిక ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, స్థానిక అధికారులు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ఆదేశాలలో స్పష్టం చేశారు. సద్దుల బతుకమ్మను ముఖ్యంగా పెద్ద ఎత్తున జరుపుకోవడం రాష్ట్రవ్యాప్తంగా ఆనందోత్సాహాలకు నాంది పలుకుతుంది. ఈ సందర్భంగా అధికార యంత్రాంగం భద్రతా చర్యలు, త్రాగునీరు, లైటింగ్, రవాణా సౌకర్యాలు వంటి అన్ని ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది."





Next Story