- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: హిల్ట్ పాలసీ లీక్‌పై తెలంగాణ ప్రభుత్వం సీరియస్
హిల్ట్ పాలసీ లీకుపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ (Hilt policy) పాలసీకి సంబంధించిన విధాన నిర్ణయం జీవో విడుదల కాకముందే దీనికి సంబంధించిన సమాచారం ప్రతిపక్షాలకు లీక్ కావడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. పాలసీని తీసుకురావాలని కసరత్తు చేస్తున్న దశలోనే సమాచారం లీకై ప్రతిపక్షాలకు చేరడంపై దృష్టి సారించింది. ఈ లీకుల వ్యవహారంలో నిగ్గు తేల్చేందుకు తాజాగా ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. నవంబర్ 20 న ఫోటోషాప్ స్లైడ్స్ బయటకు వచ్చినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ మరుసటి రోజు నవంబర్ 21న హిల్ట్ పాలసీపై ప్రతిపక్ష నేత కేటీఆర్ (KTR) ప్రెస్‌మీట్ పెట్టిన ప్రభుత్వ పాలసీపై విమర్శలు గుప్పించారు. అయితే నవంబర్ 22న ప్రభుత్వం జీవో విడుదల చేయగా అంతకు ముందురోజే కేటీఆర్ ఈ అంశాన్ని ప్రస్తావించడం వెనుక సమాచార లీకుల వ్యవహారం ఉందనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో ఇప్పటికే శాఖాపరమైన విచారణకు ఆదేశించిన అధికారులు తాజాగా విజిలెన్స్ విచారణకు (Vigilance investigation) ఆదేశించారు.






