- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భూముల వేలానికి తెలంగాణ సర్కార్ సన్నద్ధం.. ఎకరం ధర రూ.104 కోట్లు!
హైదరాబాద్ (Hyderbad) మహానగర శివారు ప్రాంతాల్లో భూములను వేలం వేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ (Hyderbad) మహానగర శివారు ప్రాంతాల్లో భూములను వేలం వేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ మేరకు మొత్తం 66 ఎకరాలను తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGIIC) ద్వారా విక్రయించనుంది. రాయదుర్గంలో 4 ప్లాట్లు, ఉస్మాన్ సాగర్‌లో 46 ఎకరాలతో సహా 13 ప్లాట్లను వేలం వేయాలని నిర్ణయించారు. మొత్తం 17 ల్యాండ్ పార్సిల్స్‌లోని 66 ఎకరాల అమ్మకానికి ఇటీవల TGIIC రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్పిలిచింది. టెండర్ దాఖలుకు ఆగస్టు 8 వరకు గడువు పెట్టింది. అదే రోజు టీజీఐఐసీ బోర్డు రూంలో టెక్నికల్ ప్రజెంటేషన్, ఆగస్ట్ 12న టెండర్ అవార్డు ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా రాయదుర్గంలోని 15A/2 ప్లాట్‌కు అత్యధికంగా మార్కెట్ ధర రూ.71.60 కోట్లని అధికారులు వెల్లడించారు. ఇక్కడ మొత్తం 7.67 ఎకరాల భూమిని వేలం వేయనున్నారు. అదేవిధంగా రాయదుర్గంలోని ప్లాట్ 19 ధర రూ. 66.30 కోట్లుగా నిర్ణయించారు. 14B/1, 14A/1 ప్లాట్ల మార్కెట్ ధరను చదరపు గజానికి రూ.2,16,405గా ప్రకటించారు. ముఖ్యంగా రాయదుర్గంలో ఎకరం ధర గరిష్టంగా రూ.104.74 కోట్లుగా టీజీఐఐసీ నిర్ధారించింది.






