TG: మహిళా సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్

by Prasad Jukanti |   (  Updated:2025-11-24 12:34:23  IST  )

వడ్డీ లేని రుణాల విషయంలో మహిళా సంఘాలకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.

TG: మహిళా సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఇప్పటికే మహిళల కోసం పలు పథకాలు ప్రారంభించగా తాజాగా మహిళా స్వయం సహాయక సంఘాలు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఈ మహిళా సంఘాలకు రూ.304 కోట్ల వడ్డీ లేని రుణాలను (Interest Free Loans) ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. 3,57,098 గ్రామీణ మహిళా స్వయం సహాయ సంఘాల ఖాతాల్లో ఈ నిధులను జమచేయబోతున్నారు. ఈ మేరకు ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), మంత్రి సీతక్క (Minister Sitakka) ఆధ్వర్యంలో జిల్లా DRDA అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

బీఆర్ఎస్ పై మండిపాటు:

ములుగు జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి సీతక్క ఏటూరు నాగారం నుంచి వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా పక్షపాతి అని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా సంఘాలకు రూ. 3,500 కోట్ల వడ్డీలను ఎగవేసిందని మండిపడ్డారు. మహిళల పదుపు సొమ్మును సైతం గత ప్రభుత్వం కాజేసిందని విమర్శించారు. ఆడబిడ్డల కష్టాన్ని కాజేసి కన్నీళ్ళకు కారణమైన బీఆర్ఎస్ పెద్దలకు మహిళా సంక్షేమంపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ప్రజా ప్రభుత్వం మహిళల సాధికారత కోసం అనేక కార్యక్రమాలు ప్రారంభించిందని చెప్పారు.

Next Story