- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతుల సంక్షేమంలో తెలంగాణ ప్రభుత్వం భేష్
పంజాబ్ రైతుల విషయంలో సుప్రీం కోర్టు గతంలో వేసిన హై పవర్ కమిటీ తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించింది. ప్రభుత్వం రైతు

రైతుల సంక్షేమంలో తెలంగాణ ప్రభుత్వం భేష్
సుప్రీం కోర్టు వేసిన హై పవర్ కమిటీ కితాబు
దిశ, తెలంగాణ బ్యూరో : పంజాబ్ రైతుల విషయంలో సుప్రీం కోర్టు గతంలో వేసిన హై పవర్ కమిటీ తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించింది. ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పనిచేస్తుందని, రైతుల ఆర్థికాభివృద్ధికి ఎంతగానో దోహదపడ్తుందని కొనియాడింది. బుధవారం హర్యానాలోని పంచకుల నగరంలో ప్రభుత్వ వ్యవసాయ కార్యాలయం లో హై పవర్ కమిటీ తో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, విత్తన చట్టం కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో హై పవర్ కమిటీ తెలంగాణ రాష్ట్రంలోని రైతుల సమస్యలు, ప్రభుత్వ పథకాలు, ప్రధాన పంటలపై సుదీర్ఘంగా చర్చించారు.
తెలంగాణ ప్రభుత్వం రైతులకు చేసిన రుణమాఫీ, రైతు భరోసా, సన్నాలకు బోనస్, రాయితీ లపై వ్యవసాయ పనిమొట్లు లాంటి పథకాలపై హై పవర్ కమిటీ కి తెలంగాణ బృందం వివరించింది. దానికి హై పవర్ కమిటీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డిని అభినందించారు. ఇతర రాష్ట్రాల్లో రైతుల సమస్యలు, అక్కడి పాలసీలకంటే తెలంగాణలో బాగా ఉన్నాయని హై పవర్ కమిటీ అభిప్రాయపడింది. అదేవిదంగా ములుగు విత్తనోత్పత్తి ఘటనపై కూడా హై పవర్ కమిటీ ఆరా తీసింది. ములుగు లో జరిగిన ఇష్యూ ను మల్టీనేషనల్ విత్తన కంపెనీల మోసాలపై హై పవర్ కమిటీ దృష్టికి కోదండరెడ్డి తెచ్చారు.
సమగ్ర మైన విత్తన చట్టం తోనే విత్తన కంపెనీలను కట్టడి చెయ్యొచ్చని, విత్తనోత్పత్తి చేసే రైతులకు న్యాయం జరుగుతుందని వివరించారు. ఐతే విత్తన చట్టం తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పై కూడా హై పవర్ కమిటీ కివివరించారు. వ్యవసాయం రాష్ట్ర పరిధిలోని అంశమని విత్తన చట్టం రాష్ట్ర పరిధి లోకే వస్తుందని, కేంద్రం అడ్డుకునే విధానం సరికాదన్నారు. తెలంగాణ బృందం చేసిన విలువైన సూచనలను హై పవర్ కమిటీ నోట్ చేస్తుకుందని, మరిన్ని సలహాలు సూచనలు ఉంటే.. సీల్డ్ కవర్లో రాసి పంపాలని హై పవర్ కమిటీ చెప్పినట్లు కోదండరెడ్డి తెలిపారు.






