తెలంగాణ సర్కార్ ఢిల్లీ కాంగ్రెస్‌ హైకమాండ్‌కు ఓ ఏటీఎం: కేంద్ర మంత్రి శోభా కరండ్లజే

by Kema Shiva Kumar |

తెలంగాణ సర్కార్ ఢిల్లీ కాంగ్రెస్‌ హైకమాండ్‌కు ఓ ఏటీఎంలా మారిందని బీజేపీ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఆఫీసర్‌, కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే (Shobha Karandlaje) ఆరోపించారు.

తెలంగాణ సర్కార్ ఢిల్లీ కాంగ్రెస్‌ హైకమాండ్‌కు ఓ ఏటీఎం: కేంద్ర మంత్రి శోభా కరండ్లజే
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సర్కార్ ఢిల్లీ కాంగ్రెస్‌ హైకమాండ్‌కు ఓ ఏటీఎంలా మారిందని బీజేపీ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఆఫీసర్‌, కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే (Shobha Karandlaje) ఆరోపించారు. ఇవాళ ఆమె హైదరాబాద్‌ (Hyderabad)లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. తాను కర్ణాటక (Karnataka) రాష్ట్రం నుంచి వచ్చానని తెలిపారు. గత రెండేళ్లుగా తమ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలన కొనసాగుతోందని అన్నారు. తెలంగాణ (Telangana)లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడుస్తోందని తెలిపారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఢిల్లీలోని హైకమాండ్‌కు ఓ ఏటీఎం కార్డుల మారాయని పేర్కొన్నారు.

ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే ఉద్దేశంతో ప్రజలకు విచ్చలవిడిగా హామీలు ఇచ్చారని.. కానీ, ఏ ఒక్క హామీని నెరవేర్చిన పాపన పోలేదన్నారు. 2 ఏళ్లు గడిచాక కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించామా.. అని జనం అనుకుంటున్నారని తెలిపారు. ప్రజా సంక్షేమానికి సంబంధించి తమ రాష్ట్రంలో ఏ ఒక్క పథకం అమలు చేయలేదని ఫైర్ అయ్యారు. రహదారులు, విద్యుత్, విద్య ఇలా అన్ని రంగాల్లో రాష్ట్రం పూర్తిగా వెనబడిందని ధ్వజమెత్తారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏం చేసిందంటూ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. అభివృద్ధి ఎక్కడ జరుగుతుందో చెప్పాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి భారీగా నిధులు మంజూరైనా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదని మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో కమీషన్ల రాజ్యం నడుస్తోందని, ఢిల్లీకి సూట్‌కేసులు వెళ్తున్నాయని అన్నారు. తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాలను గద్దె దింపేందుకు ప్రజలు మందుకు రావాలని శోభా కరంద్లాజే పిలుపునిచ్చారు.

కార్యకర్తల అభీష్టం మేరకే కొత్త అధ్యక్షుడి ఎన్నిక..

తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం విషయంలో పార్టీ అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని బీజేపీ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఆఫీసర్‌ శోభా కరంద్లాజే అన్నారు. రాబోయే మూడేళ్ల కాలానికి గాను పార్టీ నాయకులు, కార్యకర్తల అభీష్టం మేరుకు రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని అన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులతో తాము ఇప్పటికే ఢిల్లీలో భేటీ అయ్యాయని, అన్ని విషయాలు తెలుసుకున్నామని పేర్కొన్నారు. ఇవాళ సాయంత్రం అభ్యర్థిని ఎంపిక చేసి నామినేషన్ వేయిస్తామని శోభా కరంద్లాజే వెల్లడించారు.

Next Story