మహిళా క్రికెటర్లకు తెలంగాణ ప్రభుత్వం సన్మానం

by Gantepaka Srikanth |

కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ చేసిందేమీ లేదు.. రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌ జూబ్లీహిల్స్‌కు చేసిందేమీ లేదు..

మహిళా క్రికెటర్లకు తెలంగాణ ప్రభుత్వం సన్మానం
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ చేసిందేమీ లేదు.. రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌ జూబ్లీహిల్స్‌కు చేసిందేమీ లేదు.. ఇప్పుడు ఈ రెండు పార్టీలు జూబ్లీహిల్స్‌ ప్రచారంలో కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నాయని మాజీ ఎంపీ వీ.హనుమంత రావు(V. Hanumantha Rao) సీరియస్ అయ్యారు. ఈ రెండు పార్టీలతో పదేళ్లు రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి కోసం రూ.100 కోట్లు ఇస్తామని ప్రకటించారు. ఈ అవకాశాన్ని జూబ్లీహిల్స్ ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. బీజేపీ, బీఆర్ఎస్ చేసే ఆరోపణలు పట్టించుకోవద్దని.. ఈ రెండు పార్టీలతో రాష్ట్రానికి ఏం ఉపయోగం లేదని అన్నారు. కావాలనే రాజకీయలబ్ధి కోసం ప్రజలను తప్పుదారి పట్టించి.. మోసం చేయాలని చూస్తున్నాయని ఆరోపించారు. జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్‌, బీజేపీలకు ఓటు వేసి ఉపయోగం లేదని అన్నారు. ఇన్నాళ్లు అభివృద్ధి చేయలేనోళ్లు ఇప్పుడు కూడా చేయరు అని చెప్పారు. ఇన్ని రోజులు కాంగ్రెస్ కేబినెట్‌లో మైనార్టీలకు చోటు లేదని విమర్శించారు.. అజారుద్దీన్‌కు చోటు కల్పిస్తే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సన్నబియ్యం, డబుల్ బెడ్ ఇల్లు, మహిళలకు ఫ్రీ బస్, నిరుద్యోగులకు 60 వేల పైగా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని అన్నారు. దేశానికి వరల్డ్ కప్ సాధించి పెట్టిన మహిళా క్రీడాకారులను త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం తరపున సన్మానం చేయబోతున్నామని అన్నారు.

Next Story