- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రీల్స్ చేసేవారికి తెలంగాణ ప్రభుత్వం సూపర్ న్యూస్.. రూ.లక్ష గెలిచే ఛాన్స్
రీల్స్ చేసే వారికి తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌పై రీల్స్ చేస్తే ఏకంగా రూ.1 లక్ష బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: రీల్స్ చేసే వారికి తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌పై రీల్స్ చేస్తే ఏకంగా రూ.1 లక్ష బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. మంగళవారం తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్ ఈ ప్రకటనను విడుదల చేసింది. ఈ కాంటెస్ట్‌కు సంబంధించిన వివరాలను షేర్ చేసింది. ‘గడిచిన 9 సంవత్సరాలలో హైదరాబాద్ అభివృద్ధిపై 60 సెకన్ల వీడియో తీయాలి. దానిని సోషల్ మీడియాలో #HappeningHyderabad హ్యాష్‌టాగ్‌తో @DigitalMediaTSతో ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్‌లో షేర్ అప్లోడ్ చేయాలి. దాంతోపాటు [email protected] ఈమెయిల్‌కు షేర్ చేయాలి. ఈ ప్రక్రియకు కేవలం ఏప్రిల్ 30 వరకు మాత్రమే ఛాన్స్. ఈ కాంటెస్ట్‌లో గెలిచి రూ.1,00,000/- విలువైన నగదు బహుమతులు గెలుచుకోండి. వివరాల కోసం http://it.telangana.gov.in/contestని సందర్శించండి’అంటూ పేర్కొంది.
Read more:
Mahila Samman Saving Certificate :మహిళలకు వరం.. ‘మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్’






