- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త.. డీఏ పెంపు
ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) భారీ శుభవార్త చెప్పింది.

దిశ, వెబ్‌డెస్క్: ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) భారీ శుభవార్త చెప్పింది. ఉద్యోగుల డీఏ 3.64 శాతానికి పెంచుతూ జీవో జారీ చేసింది. 2023 జనవరి 1వ తేదీ నుంచి పెంచిన డీఏ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా, ఇటీవల రెండు డీఏలు ఇవ్వాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇవాళ ఒక డీఏ ఇచ్చిన ప్రభుత్వం, మరో ఆరు నెలల తర్వాత మరో డీఏ అందించనుంది.
కాగా, ఉద్యోగులకు ప్రకటించిన ఒక డీఏ చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి నెలా సగటున సుమారు రూ.200 కోట్లు.. ఏడాదికి దాదాపు రూ.2,400 కోట్ల అదనపు భారం ఖజానాపై పడనుందని ఆర్థికశాఖ వర్గాలు లెక్కలు తీశాయి. ఓ వైపు పెద్ద ఎత్తున అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలకు నిధుల కొరత రాకుండా చూస్తూనే మరోవైపు ఎంప్లాయీస్ సంక్షేమానికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. అందులో భాగంగా ఇప్పటినుంచి ప్రతినెలా రూ.700 కోట్లను రిటైర్డ్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ కోసం ఖర్చు చేయాలని నిర్ణయం తీసుకున్నది. మొత్తం ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. అందులో ఇకటి ఇవ్వడానికి సిద్ధమవగా.. మరో నాలుగు పెండింగ్‌లో ఉండనున్నాయి.






