- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త.. గడువు పెంపు
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం(Congress Govt) శుభవార్త చెప్పింది. రాజీవ్ యువ వికాసం పథకం(Rajiv Yuva Vikasam Scheme) గడువు పెంచింది.

దిశ, వెబ్‌డెస్క్: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం(Congress Govt) శుభవార్త చెప్పింది. రాజీవ్ యువ వికాసం పథకం(Rajiv Yuva Vikasam Scheme) గడువు పెంచింది. ఈనెల 24 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొంది. ఈ మేరకు సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో ఆర్థికంగా వెనుకబడిన యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా అర్హులైన ప్రతీ నిరుద్యోగికి రుణాలు అందజేయనున్నది. మొత్తం 4,42,438 మంది లబ్ధిదారులకు రూ.8,083.23 కోట్లు ఇచ్చేందుకు రెడీ అయ్యింది. అయితే.. టెక్నికల్ ఇష్యూ వల్ల అనేకమంది దరఖాస్తూ చేసుకోలేకపోయారని.. గడువు పెంచాలని పెద్ద ఎత్తున డిమాండ్స్ వచ్చాయి. ఆదివారం ఎన్‌ఎస్‌యూఐ నేతలు సైతం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని విజ్ఞప్తిని చేశారు. దీంతో గడువు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు సాయం
రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా అర్హులైన నిరుద్యోగులు రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఆర్థిక సాయం పొందవచ్చు. ఇందులో 60% నుంచి 80% వరకు సబ్సిడీ ఉండనుంది.
స్కీమ్‌కు కావాల్సిన పత్రాలు
– ఆధార్‌కార్డు
– రేషన్‌కార్డు, ఫుడ్‌సెఫ్టీ కార్డు
– మీ సేవ ద్వారా తీసిన క్యాస్ట్ అండ్ ఇన్కమ్
– పర్మినెంట్డ్రైవింగ్లైసెన్స్
– పట్టదారు పాస్‌బుక్
– దివ్యాంగులైతే సదరం సర్టిఫికెట్
– దరఖాస్తుదారుడి ఫొటో
– లబ్దిదారుడి గ్రూపునకు సంబంధించి మండల స్థాయి కమిటీ సర్టిఫై చేసిన కాపీ.






