- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దారి మళ్లిన ఇండిగో ఫ్లైట్.. రాజమండ్రిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.. సేఫ్‌గా హైదరాబాద్‌కు రాక
శంషాబాద్ విమానాశ్రయం నుంచి జగదల్పూర్‌కు బయల్దేరిన ఇండిగో విమానం ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: శంషాబాద్ విమానాశ్రయం నుంచి జగదల్పూర్‌కు బయల్దేరిన ఇండిగో విమానం ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంది. శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి జగదల్పూర్‌కు బయల్దేరిన ఈ విమానం, గమ్యస్థానంలోని రన్‌వేపై వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో అక్కడ ల్యాండింగ్ సాధ్యపడలేదు. దీంతో పైలట్లు విమానాన్ని దారి మళ్లించి రాజమండ్రి విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. కొంతసేపటి అనంతరం పరిస్థితులను సమీక్షించిన ఎయిర్‌లైన్ అధికారులు విమానాన్ని రాజమండ్రి నుంచి తిరిగి హైదరాబాద్‌కు పంపించారు.
ఈ విమానంలో మొత్తం 79 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ఇండిగో ఎయిర్‌లైన్స్ అధికారులు అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిసింది. ఈ ఘటనతో ప్రయాణికులు కొంత అసౌకర్యానికి గురైనప్పటికీ, భద్రతా ప్రమాణాలను పాటిస్తూ విమాన సిబ్బంది పరిస్థితిని సమర్థంగా నిర్వహించారు.






