దివ్యాంగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

by Ajay Maddhiboyina |

దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై దివ్యాంగులు ఎవరిని వివాహం చేసుకున్నా వారికి రూ. లక్ష ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. ఇది వరకు దివ్యాంగులు సాధారణ వ్యక్తులను వివాహం చేసుకున్నప్పుడు

దివ్యాంగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
X

దిశ‌, వెబ్ డెస్క్: దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై దివ్యాంగులు ఎవరిని వివాహం చేసుకున్నా వారికి రూ. లక్ష ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. ఇది వరకు దివ్యాంగులు సాధారణ వ్యక్తులను వివాహం చేసుకున్నప్పుడు మాత్రమే వారికి ప్రోత్సాహకంగా రూ.లక్ష ఆర్థికసాయం అందించేవారు. దివ్యాంగులు దివ్యాంగులనే వివాహం చేసుకుంటే వారికి ఆర్థికసాయం అందేది కాదు. ఇద్దరిలో స్త్రీ లేదా పురుషుడు సాధరణ వ్యక్తి అయినప్పుడే ఆర్థికసాయం అందించేవారు. కాగా తాజాగా దివ్యాంగులు ఎవరిని వివాహం చేసుకున్నా లక్ష ఆర్థికసాయం అందజేస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మహిళా, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి అనితా రామచందర్ ఉత్వర్వులు జారీ చేశారు. ఇదిలా ఉంటే గ‌తంలో సాధారణ వ్యక్తును వివాహం చేసుకున్నప్పుడు మాత్రమే ఆర్థికసాయం చేయడంపై దివ్యాంగులు అంసతృప్తి వ్య‌క్తం చేసేవారు.

Next Story