TGFDC: టెక్నో కల్చరల్ ఫెస్టివల్‌కు గ్రీన్ సిగ్నల్.. రూ.55 లక్షల నిధులు మంజూరు

by Ramesh Naini |

“తెలంగాణ–నార్త్ ఈస్ట్ ఇండియా కనెక్ట్, టెక్నో–కల్చరల్ ఫెస్టివల్ కల్చరల్ సావరినిటీ త్రూ సినిమా” అనే విభిన్న సాంస్కృతిక సినిమాటోగ్రఫీ ఉత్సవాల నిర్వహణకు రూ.55 లక్షల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది.

TGFDC: టెక్నో కల్చరల్ ఫెస్టివల్‌కు గ్రీన్ సిగ్నల్.. రూ.55 లక్షల నిధులు మంజూరు
X

దిశ, తెలంగాణ బ్యూరో: “తెలంగాణ–నార్త్ ఈస్ట్ ఇండియా కనెక్ట్, టెక్నో–కల్చరల్ ఫెస్టివల్ కల్చరల్ సావరినిటీ త్రూ సినిమా” అనే విభిన్న సాంస్కృతిక సినిమాటోగ్రఫీ ఉత్సవాల నిర్వహణకు రూ.55 లక్షల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీఎఫ్డీసీ) ఆధ్వర్యంలో ఈ నెలలో హైదరాబాద్‌లోని ప్రసాద్ మల్టీప్లెక్స్, హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తెలంగాణను దేశంలోని కళ, సంస్కృతి, సినిమాటోగ్రఫీ రంగాల కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. ఈ ఫెస్టివల్ ద్వారా ఈశాన్య రాష్ట్రాలతో సాంస్కృతిక, సృజనాత్మక బంధాలు మరింత బలపడతాయని ఆయన అన్నారు.

ఈ ఫెస్టివల్‌లో జాతీయ అవార్డు గెలుచుకున్న చిత్రాల ప్రదర్శనలు, ప్యానెల్ చర్చలు, సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతాయన్నారు. తెలంగాణ రాష్ట్రం కల్చరల్ ఎక్స్చేంజ్‌కి కేంద్ర బిందువుగా ఎదుగుతున్నదని తెలిపారు. రాష్ట్ర సినీ- సాంస్కృతిక రంగాన్ని దేశవ్యాప్తంగా విస్తరించాలనే దిశగా తమ ప్రభుత్వం ముందడుగు వేస్తోందని మంత్రి వెల్లడించారు. కాగా, ఈ కార్యక్రమం పూర్తిగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

Next Story