బీడీ ఆకు సేకరించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం

by Gantepaka Srikanth |

రూ.54.90కోట్లతో బీడీ ఆకు(తునికాకు) సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

బీడీ ఆకు సేకరించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రూ.54.90కోట్లతో బీడీ ఆకు(తునికాకు) సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన అటవీశాఖ ముఖ్యకార్యదర్శి అహ్మద్ నదీం శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.30 జిల్లాలో, 37 డివిజన్లలో ఆకు సేకరించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. కాళేశ్వరం సర్కిల్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ మంచిర్యాల్ సర్కిల్, బాసర సర్కిల్, రాజన్న సర్కిల్, భద్రాద్రి సర్కిల్, చార్మినార్ సర్కిల్ పరిధిలోని 104 యూనిట్లలో 1.22లక్షల స్టాండర్డ్ బ్యాగ్ ను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో స్టాండర్డ్ బ్యాగ్ కు రూ.3,300చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే తెలంగాణ ఫారెస్ట్ డవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(టీజీఎఫ్డీసీ) ద్వారా బీడీ ఆకు సేకరణ, అమ్మకాలు జరిపించనున్నారు. బీడీ ఆకు సేకరణ, అమ్మకాలలో ఫారెస్ట్ ఆఫీసర్లకు ఫైనాన్సియల్ పవర్స్ కూడా ఇచ్చారు.

Next Story