TG: ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం.. ఖండించిన సర్కార్

by Gantepaka Srikanth |

TG: ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం.. ఖండించిన సర్కార్

TG: ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం.. ఖండించిన సర్కార్
X

దిశ, వెబ్‌డెస్క్: డిసెంబర్ 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్(Telangana Rising Global Summit) అత్యంత విజయవంతంగా జరిగింది. ఈ సమ్మిట్ ద్వారా కొన్ని కీలక ప్రకటనలు, కొత్త భాగస్వామ్యాలు ఏర్పడి రాష్ట్రానికి సూమారు రూ.5,75,000 కోట్ల విలువైన పెట్టుబడులకు అవగాహన ఒప్పందాలు కుదిరాయి. అయితే, సోషల్ మీడియా లో కొందరు తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కాలేదు కాబట్టి ఈ రోజు నుండి మూడు రోజులు పాటు హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా జరగాల్సిన యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ సమ్మిట్(YES)ను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది అని ప్రచారం చేశారు. అందులో ఎలాంటి నిజం లేదని ప్రభుత్వం ఖండించింది. ఇది పూర్తిగా అవాస్తవం, నిరాధారమైనవని కొట్టిపారేసింది.

“యంగ్ ఎంట్రప్రెన్యూర్స్ సమ్మిట్ (YES) అనేది సుధా రెడ్డి ఫౌండేషన్‌ నిర్వహిస్తున్న ఒక ప్రైవేట్‌ కార్యక్రమం. అందువల్ల ఆ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వంతో ఎటువంటి సంబంధం లేదు. అలాగే ఆ కార్యక్రమం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కొనసాగింపు కూడా కాదు. ఆ సమ్మిట్ వాయిదా పడటాన్ని ప్రభుత్వంతో ముడిపెట్టడం సరియైనది కాదు,” అని తెలంగాణ స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీసెస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ స్పష్టం చేశారు.

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్— ముఖ్యాంశాలు

= 13 లక్షల కొత్త ఉద్యోగ ఉద్యోగావకాశాలు

= మౌలిక సదుపాయాల అభివృద్ధి

= మూసీ నది అభివృద్ధి

= రక్షణ-ఏరోసైన్స్‌ హబ్‌

= కృత్రిమ మేధస్సు రంగాల పురోగతి

= మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధనే ప్రధాన లక్ష్యం

= సుమారు 3,000 మందికి పైగా విద్యార్థులు సమ్మిట్‌లో భాగస్వామ్యం

ప్రధాన అప్‌గ్రేడ్‌లు ఇవి :

1. వృత్తాకార వాటర్ గ్రిడ్

2. 100% శుద్ధి చేసిన నీటి పునర్వినియోగం

3. రవాణా సౌకర్యాలు పెంపొందించే కారిడార్లు

4. కొత్త మొబిలిటీ వ్యవస్థలు

5. ఏకీకృత కమాండ్ సెంటర్లు

6. జలవనరుల విస్తృత పునరుజ్జీవనం

ఇవి సమిష్టిగా వాతావరణ మార్పులను తట్టుకునే, స్థిరమైన పట్టణ పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తాయి.

తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ 2047

తెలంగాణను సమగ్ర వృద్ధికి జాతీయ నమూనాగా మార్చడానికి దీర్ఘకాలిక వ్యూహం.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు విద్య, ఆరోగ్య సంరక్షణ, జీవనోపాధి, డిజిటల్ యాక్సెస్, పబ్లిక్ సర్వీసెస్, సామాజిక న్యాయం, ఔట్సాహిక పారిశ్రామిక వేత్తలకు తగిన మద్దతు, వివిధ వృత్తులకు కావల్సిన నైపుణ్యాల వంటి సదుపాయాలను సమకూర్చడం, సంప్రదాయ జీవన విధానాలను ఆదినీకరించడం దీని లక్ష్యాలు.

స్టార్టప్ & ఇన్నోవేషన్ పుష్

స్టార్టప్ ఎకోసిస్టమ్ ను బలోపేతం చేయడానికి రూ. 1,000 కోట్ల రూపాయల ఫండ్ ఆఫ్ ఫండ్స్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. భారతదేశంలో మొట్ట మొదటి గూగుల్ ఫర్ స్టార్టప్స్ (జిఎఫ్ఎస్) హబ్ ను హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఉత్పత్తి ఆధారిత, ఆవిష్కరణల నేతృత్వంలోని కంపెనీలను నిర్మించడానికి వ్యవస్థాపకులను ప్రోత్సహించారు. 2034 నాటికి 100 హైదరాబాద్ స్టార్టప్లు యునికార్న్లుగా మారగలవని విశ్వాసం వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రభుత్వం యొక్క రెండు ప్రధాన నిబద్ధతలు

సమాజంలో ఉన్న ప్రతి వర్గానికి సమగ్ర అభివృద్ధి అందాలి. రాబోయే తరంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఒక పోటీతత్వంతో కూడిన ఆవిష్కరణల కు, ప్రపంచస్థాయి వ్యవస్థను అభివృద్ధి చేయాలి. అయితే కొందరు దురుద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్న ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మకండని ప్రభుత్వం పేర్కొంది.

Next Story