- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Telangana Government: తెలంగాణకు బెస్ట్ పెర్ఫార్మింగ్ స్టేట్ అవార్డు
నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ కింద ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌ను అమలు చేసినందుకు తెలంగాణ రాష్ట్రానికి “బెస్ట్ పెర్ఫార్మింగ్ స్టేట్” అవార్డు లభించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ కింద ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌ను అమలు చేసినందుకు తెలంగాణ రాష్ట్రానికి “బెస్ట్ పెర్ఫార్మింగ్ స్టేట్” అవార్డు లభించింది. మహారాష్ట్రలోని, పూణేలో ఈ వారం జరిగిన ఎంట్రప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ కాన్ క్లేవ్ 2025 సందర్భంగా, కేంద్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ, జంతు, పాడి పరిశ్రమశాఖ ఈ అవార్డును రాష్ట్రానికి అందజేసింది. ఈ సందర్భంగా, ముఖ్యమంత్రి సలహాదారు, వేం నరేందర్ రెడ్డి, సీఎం, ప్రధాన కార్యదర్శి డా. జి . చంద్రశేఖర్ రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి, సభ్యసాచి ఘోష్, తెలంగాణ పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్య శాఖకు అవార్డు వచ్చినందుకు శుక్రవారం అభినందలు తెలిపారు.
ఈ సందర్భంగా సీఎం సలహదారు, వేం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ... నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకం - వ్యవస్థాపకత అభివృద్ధి కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం అర్హత గల అభ్యర్ధులకు, సంస్థలకు, మేలు జాతి గొర్రెల-మేకల ఫారమ్, పందుల పెంపకం, దేశి కోళ్ల ఫారాలు, పశుగ్రాసం, దాణా పరిశ్రమల ఏర్పాటుకు 50% సబ్సిడీని మంజూరు చేసి రెండు విడతల్లో అందజేస్తుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు తెలంగాణలో 457 ప్రాజెక్టులను సిఫార్సు చేయగా, అందులో కేంద్ర ప్రభుత్వం 411 ప్రాజెక్టులకు గాను రూ. 180.06 కోట్ల మంజూరు చేసిందన్నారు.207 ప్రాజెక్టులకు రూ. 50.75 కోట్లు మొదటి విడత మూలధన సబ్సిడీగా విడుదల చేసినట్టు తెలిపారు.






