- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మస్కట్‌లో తెలంగాణ యువతికి వేధింపులు..కాపాడాలంటూ సీఎంకు రిక్వెస్ట్
మస్కట్‌లో వేధింపులకు గురవుతున్న ఓ యువతి తనను కాపాడాలంటూ తల్లికి సెల్ఫీ వీడియో పంపి వేడుకుంది. దీంతో ఆ తల్లి సీఎం రేవంత్ రెడ్డి తన కుమార్తెను విడిపించి ఇండియాకు రప్పించాలని వేడుకుంది.

దిశ, వెబ్ డెస్క్: మస్కట్‌లో వేధింపులకు గురవుతున్న ఓ యువతి తనను కాపాడాలంటూ తల్లికి సెల్ఫీ వీడియో పంపి వేడుకుంది. దీంతో ఆ తల్లి సీఎం రేవంత్ రెడ్డి తన కుమార్తెను విడిపించి ఇండియాకు రప్పించాలని వేడుకుంది. వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన కావ్య అనే యువతి ఏపీకి చెందిన వెంకటలక్ష్మి అనే ఏజెంట్ ద్వారా మస్కట్ వెళ్లింది. నెలకు రూ.30వేలు వస్తాయని ఏజెంట్ మాయమాటలు చెప్పడంతో బీఈడీ కోచింగ్ అని తన తల్లికి అబద్దం చెప్పి యువతి మస్కట్ వెళ్లింది.
అక్కడ ఒకరి ఇంట్లో పనికోసం వెళ్లగా యజమాని అధిక పని చెబతూ వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ విషయాన్ని కావ్య తన తల్లికి సెల్ఫీ వీడియో ద్వారా తెలియజేసేంది. తను అనారోగ్యానికి గురయ్యానని, ఇక్కడే చనిపోయేలా ఉన్నానని ఆవేదన వ్యక్తం చేసింది. ఒక ఇంట్లో అని చెప్పి ఏడు ఇళ్లలో పనిచేయించుకుంటున్నారని చెప్పింది. ముక్కులో నుండి రక్తం వస్తుందని, ఆయాసం వస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ విషయం యజమానికి చెప్పినా పట్టించుకోవడం లేదని తనకు చాలా భయంగా ఉందని తెలిపింది. ఎలాగైనా విడిపించాలని కన్నీళ్లు పెట్టుకుంది. తనను నమ్మించి మోసం చేసిన ఏజెంట్‌ను అస్సలు విడిచిపెట్టొద్దని తెలిపింది.






