- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ అవతరణ దినోత్సవం.. మొత్తం 91 మంది ఖైదీలు విడుదల
తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా సత్ప్రవర్తన గల ఖైదీలను ఎంపిక చేసి ప్రభుత్వం విడుదల చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు తీపి కబురు చెప్పింది. సత్ప్రవర్తన కలిగిన 91 మంది ఖైదీలను ముందస్తుగా విడుదల చేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఖైదీల విడుదలకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులైన జీవో ఎంఎస్ నెం.54 (GO MS No.54)ను జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల అనంతరం ఇవాళ మధ్యాహ్నం చర్లపల్లి కేంద్ర కారాగారం (Charlapally Central Prison) నుంచి 91 మంది ఖైదీలను అధికారులు విడుదల చేశారు.
కాగా, జైలు నిబంధనలకు లోబడి, శిక్షా కాలంలో ఉత్తమ ప్రవర్తన కనబరిచిన వారికే ఈ ముందస్తు విముక్తి కల్పించారు. ఇవాళ విడుదలైన వారిలో 85 మంది పురుషులు కాగా, ఆరుగురు మహిళా ఖైదీలు ఉన్నారు. తమ వారు ముందస్తుగా విడుదలవుతున్నారనే సమాచారంతో ఖైదీల కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున చర్లపల్లి జైలు వద్దకు చేరుకున్నారు. జీవో కాపీలు అందిన తర్వాత జైలు అధికారులు ఒక్కొక్కరిని బయటకు పంపించారు.






