- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ ఫైర్ సర్వీసెస్‌లో కొత్త అస్త్రం.. మంటలు ఆర్పే రిమోట్ కంట్రోల్డ్ ఫైర్ రోబో
అగ్ని ప్రమాదాల నివారణలో అగ్నిమాపక సిబ్బందికి రక్షణగా, మనుషులు వెళ్లలేని ప్రమాదకర ప్రాంతాల్లోకి సైతం చొచ్చుకుపోయే రిమోట్ కంట్రోల్ ఫైర్ రోబోను తెలంగాణ ఫైర్ సర్వీసెస్ విభాగం ఆదివారం గచ్చిబౌలిలో ప్రదర్శించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : అగ్ని ప్రమాదాల నివారణలో అగ్నిమాపక సిబ్బందికి రక్షణగా, మనుషులు వెళ్లలేని ప్రమాదకర ప్రాంతాల్లోకి సైతం చొచ్చుకుపోయే రిమోట్ కంట్రోల్ ఫైర్ రోబోను తెలంగాణ ఫైర్ సర్వీసెస్ విభాగం ఆదివారం గచ్చిబౌలిలో ప్రదర్శించారు. జాతీయ ఫైర్ సర్వీస్ వారోత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఈ అవగాహన కార్యక్రమంలో ఈ రోబో ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భవిష్యత్ అగ్నిమాపక వ్యవస్థ ఎలా ఉండబోతుందో ఈ రోబో చాటి చెబుతోంది. హైరైజ్ భవనాలు, కెమికల్ ఫ్యాక్టరీలు లేదా దట్టమైన పొగ అలుముకున్న బేస్‌మెంట్‌లలో అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు లోపలికి వెళ్లడం అగ్నిమాపక సిబ్బందికి అత్యంత ప్రమాదకరమైన పని.. ఇలాంటి సమయాల్లో సిబ్బంది ప్రాణాలు సైతం కోల్పోతుంటారు. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈ రిమోట్ కంట్రోల్డ్ రోబో అద్భుతంగా పనిచేస్తుందని అధికారులు చెబుతున్నారు.
వంద మీటర్ల దూరం నుంచి రిమోట్ ద్వారా దీనిని నియంత్రించవచ్చు.. ఈ రోబోకు అమర్చిన అత్యాధునిక కెమెరాలు మంటల తీవ్రతను, లోపల చిక్కుకున్న వారిని గుర్తించడంలో సహాయపడతాయి. అత్యధిక ఉష్ణోగ్రతను తట్టుకునే సామర్థ్యం కలిగిన ఈ రోబో, భారీ నీటి ఫిరంగులతో మంటలను అదుపు చేస్తుందని అధికారులు తెలిపారు. కృత్రిమంగా సృష్టించిన మంటల్లోకి రోబో సునాయాసంగా వెళ్లడం, నీటిని వేగంగా చిమ్మడం దీని పని, అగ్నిమాపక శాఖ అమ్ములపొదిలో చేరిన ఈ కొత్త అస్త్రం వల్ల ప్రాణ నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చని అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ఇరుకైన గల్లీలు, గాలి ఆడని గదుల్లోకి ఇది నేరుగా వెళ్లి మంటలను అదుపు చేయగలదని వారు వివరించారు.






