TG: బనకచర్ల ప్రాజెక్టు వివాదం.. బీఆర్ఎస్ కు తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ కౌంటర్

by Prasad Jukanti |

బనకచర్ల ప్రాజెక్టు చర్చపై జరుగుతునన ప్రచారంపై తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ కీలక వ్యాఖ్యలు చేసింది.

TG: బనకచర్ల ప్రాజెక్టు వివాదం.. బీఆర్ఎస్ కు తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జలవివాదాల పరిష్కారం అంశంలో నిన్న ఇరు రాష్ట్రాల సీఎంల భేటీపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ఈ భేటీలో బనకచర్ల (Banakacharla) అంశంపై చర్చ జరగలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయగా బీఆర్ఎస్ మాత్రం ఢిల్లీ బేటీ ఎజెండాలో మొదటి అంశమే గోదావరి - బనకచర్ల అని దీనిపై సీఎం అబద్ధాలు చెబుతున్నారని ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ మద్దతుదారులు సామాజిక వేదికపై పెడుతున్న పోస్టులపై తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ (Telangana fact check) ఎక్స్ వేదికగా స్పందించింది. 'నిన్న కేంద్రం.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల మధ్య జరిగిన నీటి పంపకాల సమావేశంలో బనకచర్ల ప్రాజెక్ట్ మీద చర్చ జరిగిందని సామాజిక మాధ్యమాల్లో కొన్ని పోస్టులు, కొన్ని పత్రికలు చెబుతున్నాయి. కానీ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికారిక ప్రెస్ నోట్లో బనకచర్ల ప్రాజెక్ట్ గురించి ఎలాంటి ప్రస్తావన రాలేదు. ఈ సమావేశంలో నిజంగా కృష్ణా బేసిన్‌లో టెలిమెట్రీ పరికరాల అమలు, శ్రీశైలం డ్యామ్ నిర్వహణ, కేఆర్ఎంబీ కార్యాలయాన్ని విజయవాడ/అమరావతికి తరలింపు, మిగిలిన నీటి పంపకం అంశాలపై పరిష్కారానికి కమిటీ ఏర్పాటు పైనే చర్చ' జరిగిందని తెలిపింది. దయచేసి ధృవీకరించని సమాచారాన్ని ప్రచారం చేయవద్దని నిజాలు మాత్రమే పంచుకోవాలని సూచించిది.

Next Story