- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RTC: వారికి ఆ విషయం తెలియకపోవచ్చు.. ఆర్టీసీలో టికెట్ ధరల పెంపు ప్రచారం పై అధికారిక వివరణ
మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీసు బస్సు టికెట్ ధరలను పెంచించారని జరుగుతున్న ప్రచారంపై ఆర్టీసీ క్లారిటీ ఇచ్చింది.

దిశ, డైనమిక్ బ్యూరో: టీజీఎస్ఆర్‍టీసీ (TGSRTC) మెట్రో ఎక్స్ ప్రెస్ సర్వీసు బస్సు టికెట్ ధరలను పెంచింది అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆర్టీసీ ఖండించింది. గతంలో 30 రూపాయలు ఉన్న దూరానికి ఇప్పుడు ఏకంగా రూ. 45 వసూలు చేస్తున్నారని ఒకేసారి రూ. 15 పెంచడం దారుణం అని ఈ విషయంలో ప్రతిపక్ష నేత కేటీఆర్ అసెంబ్లీ వేదికగా స్పందించాలంటూ ఓ నెటిజన్ చేసిన పోస్టు వైరల్ గా మారింది. ఈ పోస్టుపై కేటీఆర్ సైతం స్పందించారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ సంస్థ ఎండీ వై.నాగిరెడ్డి వివరాల మేరకు ఈ విషయంలో తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ అధికారిక వివరణ ఇచ్చింది. ఈ వివరాల ప్రకారం ' సోషల్ మీడియా లో కొందరు తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీసు బస్సు (Metro Express Buses) టికెట్ ధరలను పెంచింది (Ticket Price Hike) అని ప్రచారం చేసారు. అందులో ఎలాంటి నిజం లేదు. ప్రస్తుత అవసరానికి అనుగుణంగా అక్టోబర్ 6, 2025 న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆర్టీసీ నడిపే బస్సుల్లో టికెట్లపై ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెస్ విధించాం. కానీ ఆ తరవాత, తెలంగాణ లో ఆర్టీసీ నడిపే బస్సుల్లో ఎలాంటి టికెట్ ధరలను పెంచలేదు. సాధారణంగా, ఆర్టీసీ బస్సు టిక్కెట్ల ధరల పెరుగుదల డీజిల్ ధరకు నేరుగా అనుసంధానంగా పెరుగుతాయి. ఇంధన ధరలు పెరిగినప్పుడల్లా, టీజీఎస్‌ఆర్టీసీ ధరల పెరుగుదలను ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి లేఖ రాస్తాం. కానీ చాలా సందర్భాల్లో, టికెట్ ధరల పెంచడం వల్ల ప్రయాణికులకు కలిగే ఆసౌకర్యాని దృష్టిలో ఉంచుకుని ఆ ప్రతిపాదనను తిరస్కరిస్తాం. కాకపోతే, టికెట్లపై ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెస్ వసూలు చేస్తున్నా విషయం చాల కాలం తరవాత ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న వారికి తెలియకపోవచ్చు అని నాగిరెడ్డి తెలిపారు' అంటూ టీజీ ఫ్యాక్ట్ చెక్ వివరణ ఇచ్చింది.
దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ధరల పెంపును మీరు సెస్ అని పిలవండి లేదా ఇంకేమైనా పిలవండి. కానీ ప్రజలమ మీద భారం పడుతోందా లేదా అని ఓ నెటిజన్ ప్రశ్నించారు. మరో నెటిజన్ రియాక్ట్ అవుతూ.. నిన్న పెంచామా మొన్న పెంచామా అన్నది కాదు టికెట్ ధరలు పెరిగాయనేది జనాల బాధ అని కామెంట్ చేశారు.






