స్వాతంత్ర్య దినోత్సవం వేళ తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ కీలక డిమాండ్

by Bhoopathi Nagaiah |

ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నాయని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ జి.నిర్మల అన్నారు.

స్వాతంత్ర్య దినోత్సవం వేళ తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ కీలక డిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలైన సందర్భంగా ఈ వేడుకల్ని మనం జరుపుకుంటున్నామని, అదే సందర్భంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్ల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నాయని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ జి.నిర్మల అన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ కేంద్ర సంఘ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఉద్యోగుల ఉపాధ్యాయులకు న్యాయంగా రావాల్సిన పీఆర్సీ, పెండింగ్ డీఏలు, నగదురహిత వైద్యం, పాత పెన్షన్ పునరుద్ధరణ, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్‌కు సమాన పనికి సమాన వేతనం నేటికీ కరువైందన్నారు.

రాష్ట్ర అభివృద్ధి కొరకు ఉద్యోగులు ఉపాధ్యాయులు తమ శక్తి వంచన లేకుండా కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. అదే సమయంలో వారి న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటానికి వెనుకడుగు వేయరని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగ ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేని పక్షంలో త్వరలోనే ఉద్యోగ ఉపాధ్యాయులతో సంప్రదించి తమ న్యాయమైన డిమాండ్ల కొరకు భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చైర్మన్ చిలగాని సంపత్ కుమార్ స్వామి, వైస్ చైర్మన్ గడ్డం బాలస్వామి, ప్రధాన కార్యదర్శి జాజాల రంజిత్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు గౌతమ్ తత్వానంద్ చారి, ప్రతాప్, మేరీ , లావణ్య, రాష్ట్ర కార్యదర్శి శ్రీ జ్ఞాన ప్రకాష్ గారు ఎన్నమల్ల సైదులు గారు తదితరులు పాల్గొన్నారు.

Next Story