- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మున్సిపల్ ఎన్నికలకు నోడల్ అధికారుల నియామకం.. ఎస్ఈసీ ఉత్తర్వులు
by Naga Rani Yarlagadda |
తెలంగాణలో రెండ్రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (TGSEC) క్లస్టర్లవారీగా 9 మంది నోడల్ అధికారులను నియమించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో రెండ్రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (TGSEC) క్లస్టర్లవారీగా 9 మంది నోడల్ అధికారులను నియమించింది. ఈ మేరకు TGSEC కార్యదర్శి లింగ్యానాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికలపై ఎవరైనా ఫోన్ ద్వారా నోడల్ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని ఆయన తెలిపారు. సోమవారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ నోడల్ అధికారులు అందుబాటులో ఉంటారని, రేపు (సోమవారం) రాత్రి వరకూ అధికారులకు 9247597066 కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. నోడల్ అధికారులు ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. అలాగే అందిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించడం, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకు వెళ్లాల్సిన బాధ్యత నోడల్ అధికారులదేనని స్పష్టం చేశారు.
Next Story






