తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి రాజీనామా

by Gantepaka Srikanth |   (  Updated:2026-05-22 13:14:00  IST  )

తెలంగాణ ప్రభుత్వ విద్యా వర్గాల్లో భారీ సంచలనం చోటుచేసుకుంది. రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తన పదవికి ఆకస్మికంగా రాజీనామా చేశారు.

తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి రాజీనామా
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వ విద్యా వర్గాల్లో భారీ సంచలనం చోటుచేసుకుంది. రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తన పదవికి ఆకస్మికంగా రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు పంపించారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలోపేతం, సంస్కరణల కోసం ప్రభుత్వం విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసి, దానికి చైర్మన్ ఆకునూరి మురళిని నియమించిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన పదవీ కాలం ముగియడానికి ఇంకా నాలుగు నెలల సమయం ఉండగానే, ముందే ఈ పదవి నుంచి తప్పుకోవడం ఇప్పుడు రాజకీయ, విద్యా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

లేఖలో ఏముందంటే..?

తన రాజీనామాకు గల కారణాన్ని ఆకునూరి మురళి సీఎస్‌కు పంపిన లేఖలో స్పష్టం చేశారు. ప్రభుత్వం విద్యా కమిషన్ చైర్మన్‌గా తనకు అప్పగించిన బాధ్యతలను, పనిని విజయవంతంగా పూర్తి చేశానని ఆయన అందులో పేర్కొన్నారు. బాధ్యత నెరవేరినందున పదవి నుంచి తప్పుకుంటున్నట్లు వివరించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, విద్యా ప్రమాణాల మెరుగుదలపై నిరంతరం గళమెత్తే ఆకునూరి మురళి.. కమిషన్ చైర్మన్ విద్యా రంగంలో కీలక మార్పుల కోసం ప్రభుత్వానికి పలు సిఫార్సులు చేశారు. అయితే, పదవీ కాలం ఉండగానే ఆయన తప్పుకోవడం వెనుక కేవలం పని పూర్తి కావడమే కారణమా, లేక అంతర్గతంగా మరేదైనా సమీకరణాలు ఉన్నాయా అన్న కోణంలో చర్చలు మొదలయ్యాయి. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Next Story