- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీజీఈఏపీసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
by Naga Rani Yarlagadda |
తెలంగాణ రాష్ట్రంలో ఈఏపీసెట్ 2025 (TGEAP) కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో ఈఏపీసెట్ 2025 (TGEAP) కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. ఈసారి కౌన్సెలింగ్‌ను మూడు విడతల్లో నిర్వహించనున్నారు. మొదటి విడతలో జూన్ 29 నుంచి జులై 7 వరకు అభ్యర్థులు స్లాట్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉంది. జులై 6 నుంచి 10వ తేదీ వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. జులై 14, 15 తేదీల్లో మాక్ సీట్ల కేటాయింపు ప్రక్రియ జరుగుతుంది. జులై 18వ తేదీలోపు మొదటి విడత సీట్ల కేటాయింపు ప్రక్రియను పూర్తిచేయనున్నారు.
రెండో విడత కౌన్సెలింగ్ జులై 25 నుంచి ప్రారంభమవుతుంది. జులై 26న ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది. అదే రోజు, జులై 27న వెబ్ ఆప్షన్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. జులై 30వ తేదీలోపు రెండో విడత సీట్ల కేటాయింపు ప్రక్రియను ముగిస్తారు. మూడో విడత తేదీలను అధికారులు త్వరలో వెల్లడించనున్నారు.
Next Story






