- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: కాకతీయ మూలాల కోసం అన్వేషణ..ఖమ్మంలో అరుదైన పాత్ర వెలుగులోకి
కాకతీయ గ్రామాన్ని గుర్తించే పరిశోధనల్లో భాగంగా తెలంగాణ డిస్కవరీ టీం సభ్యులు మరుదైన పాత్రను గుర్తించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కాకతీయ గ్రామాన్ని గుర్తించే క్రమంలో కొనసాగుతున్న పరిశోధనలో అరుదైన మృన్మయ పాత్ర వెలుగులోకి వచ్చింది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి బైరవ గుట్ట దిగువన శాతవాహన (Satavahana period) కాలం నాటి ఆవాస ప్రాంతంలో అరుదైన మృన్మయ పాత్రను గుర్తించినట్లు డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి తెలిపారు. కాకతీయుల మూల పురుషుడు కాకర్త్య గుండన కాకతీ గ్రామానికి (Kakatiya village) చెందిన వాడని కోదాడ శాసనాలు వెల్లడిస్తున్నాయి. ఆ కాకతీయ గ్రామాన్ని గుర్తించే పరిశోధనలను తెలంగాణ డిస్కవరీ టీం (Telangana Discovery Team) సభ్యులు డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్‍రెడ్డితో పాటు దేశెట్టి జితేందర్, వినయ్ గోలి, చెరుకు శ్రీకాంత్, ఉత్తమరాజు వంశీ, బోగయ్య నేలకొండపల్లిని సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక పాటిగడ్డను సందర్శించారు. ఎరుపు రంగు "రింగు" వంటి వృత్తాకార మట్టి పాత్ర అంచును గుర్తించారు. ఇటువంటిదే జనగామ జిల్లా గోవర్ధనగిరి గ్రామంలోని గుర్తించినట్లు తెలిపారు. వృత్తాకార మట్టి బిల్లా ఎరుపు నలుపు రంగుతో ఉన్న కుండ పెంకులు ,రాతి పనిముట్లను గుర్తించారు.






