- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొత్తం కొలాప్స్.. మావోయిస్టులపై తెలంగాణ DGP కీలక వ్యాఖ్యలు
హిడ్మా మృతి తర్వాత ఆ స్థానంలో బార్సె దేవాను మావోయిస్టు పార్టీ నియమించిందని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు.

దిశ, వెబ్‌డెస్క్: మావోయిస్టు(Maoist)ల లొంగుబాటు సందర్భంగా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి(Telangana DGP Shivdhar Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. హిడ్మా మృతి తర్వాత ఆ స్థానంలో బార్సె దేవాను మావోయిస్టు పార్టీ నియమించిందని తెలిపారు. ఆయుధాల సేకరణలో బార్సె దేవాది కీలకపాత్ర అని చెప్పారు. దేవాతో పాటు 48 మంది మావోయిస్టులు లొంగిపోయారని వెల్లడించారు. ఈ లొంగుబాటుతో PLGA బెటాలియన్ మొత్తం కొలాప్స్ అయిందని ప్రకటించారు. లొంగిపోయిన వారికి నిబంధనల ప్రకారం రివార్డులు అందిస్తామని స్పష్టం చేశారు. కాగా, బార్సే దేవా, తెలంగాణకు చెందిన రాజిరెడ్డి అతని భార్యతో పాటు 20 మంది సభ్యులు నిన్ననే లొంగిపోగా.. ఆ వివరాలను డీజీపీ శనివారం మీడియాకు వెల్లడించారు. మావోయిస్టు పార్టీ గెరిల్లా ఆర్మీ చీఫ్‌గా దేవా పని చేస్తున్నారు. లొంగిపోయిన వారి నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను, రూ. 20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. హెలికాప్టర్లను కూల్చేందుకు వాడే సామగ్రి కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ లొంగుబాటు పీఎల్‌జీఏకు భారీ దెబ్బగా భావిస్తున్నట్లు చెప్పారు.






