రాహుల్ సంగతి తర్వాత.. బీజేపీ చేసే ఆ పనులకు కాంగ్రెస్ కార్యకర్త కూడా భయపడడు: డిప్యూటీ CM భట్టి కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌(Enforcement Directorate)తో కాంగ్రెస్ పార్టీని భయపెట్టాలని చూస్తే అది జరిగే పని కాదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) అన్నారు.

రాహుల్ సంగతి తర్వాత.. బీజేపీ చేసే ఆ పనులకు కాంగ్రెస్ కార్యకర్త కూడా భయపడడు: డిప్యూటీ CM భట్టి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌(Enforcement Directorate)తో కాంగ్రెస్ పార్టీని భయపెట్టాలని చూస్తే అది జరిగే పని కాదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) అన్నారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారం ఉన్నా.. లేకపోయినా కాంగ్రెస్ ఎప్పుడూ ప్రజాస్వామ్యం కోసమే పోరాటం చేస్తుందని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం నెహ్రూ నేషనల్ హెరాల్డ్ పత్రిక పెట్టారని గుర్తుచేశారు. ఇప్పుడా పత్రికను చూసి బీజేపీ భయపడుతోందని ఎద్దేవా చేశారు. బ్రిటీష్ వారికే గాంధీ కుటుంబం భయపడలేదని.. ఈ బీజేపీ ఎంత అని కీలక వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ(Sonia Gandhi), రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు పెట్టే కేసులకు కాంగ్రెస్ కార్యకర్త కూడా భయపడడని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే ఎన్నో పనులు చేశామని తెలిపారు.

చారిత్రాత్మక కులగణన చేసి దేశానికే ఆదర్శంగా నిలిచామని అన్నారు. కులగణన చేసి రాష్ట్రంలో 56 శాతం బీసీలు ఉన్నారని తేల్చినట్లు చెప్పారు. మహిళలకు ఆర్టీసీల్లో ఉచిత బస్సు ప్రయాణం కల్పించినట్లు తెలిపారు. రూ.500లకే గ్యాస్ సిలిండర్‌తో పాటు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 60 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చి. నిరుద్యోగులకు భరోసా కల్పించామని అన్నారు. దేశ వ్యాప్తంగా కులగణన చేయాలన్న రాహుల్ గాంధీ(Rahul Gandhi) డిమాండ్‌కు మోడీ భయపడుతున్నారని విమర్శించారు. రాహుల్, సోనియాపై కేసులు పెట్టి.. దేశ వ్యాప్తంగా కులగణన జరుగకుండా అడ్డుకోవాలని చూస్తున్నారని అన్నారు. కానీ అది జరిగే పని కాదని.. కాంగ్రెస్ ఏదైనా పోరాటం మొదలు పెడితే.. అది జరిగేవరకూ ఆగదని వెల్లడించారు.

Next Story