- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బెట్టింగ్ యాప్స్ కేసులపై సీఎం రేవంత్ సంచలన నిర్ణయం !
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బెట్టింగ్ యాప్స్ (Betting Apps) కేసులపై... సరికొత్త అడుగు వేయబో

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బెట్టింగ్ యాప్స్ (Betting Apps) కేసులపై... సరికొత్త అడుగు వేయబోతోంది. బెట్టింగ్ యాప్స్ కేసులను సిఐడి కి ( CID) బదిలీ చేయాలని.. రేవంత్ రెడ్డి ( Revanth reddy ) ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో బెట్టింగ్ యాప్స్ కేసులను సిఐడి మాత్రమే విచారణ చేయబోతోంది. హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో నమోదు అవుతున్న కేసులు అన్నిటిని... సిఐడి కి అప్పగించబోతోంది తెలంగాణ ( Telangana )రాష్ట్ర ప్రభుత్వం.
ఈ కేసులను సిఐడి మాత్రమే... లోతుగా దర్యాప్తు చేయగలరని.. భావించిన రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుందని సమాచారం అందుతోంది. భవిష్యత్తులో ఇలాంటి కేసులు నమోదు కాకుండా కూడా చూడాలని సిఐడి కి దిశా నిర్దేశం చేసారని తెలుస్తోంది. హైదరాబాదులో 11 మంది బెట్టింగ్ యాప్స్ కార్యకర్తలపై కూడా కేసులు నమోదు అయ్యాయి. సైబరాబాద్ లో బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేసిన 25 మంది సెలబ్రిటీలపై కూడా కేసులు పెట్టారు.
టాలీవుడ్ ( Tollywood) అగ్ర హీరోల నుంచి.. కిందిస్థాయి యూట్యూబర్ల వరకు అందరిపై కేసులు వరుసగా నమోదు అవుతున్నాయి. అటు బెట్టింగ్ యాప్స్ కంపెనీలపై కూడా తెలంగాణ పోలీసులు కేసులు పెడుతున్నారు. కొంత మంది సినీ నటులకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తున్నారు. విదేశాలకు పారిపోయిన వారిని తెలంగాణకు రప్పించే ప్రయత్నం.. చేస్తున్నారు పోలీసులు. ఈ బెట్టింగ్ యాప్ కేసుల్లో భాగంగా... కొంతమంది కిందిస్థాయి యూట్యూబర్లకు.... లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. విదేశాలకు పారిపోయిన వారు తెలంగాణకు రాగానే.. అరెస్టు కూడా అవుతారు.






