- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికపై జిల్లా కలెక్టర్లతో సిఎస్ టెలీకాన్ఫరెన్స్
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈనెల 18 తేదీ నుండి 23వ తేదీ వరకు నిర్వహించే యువజన, క్రీడా, పర్యాటక వారోత్సవాలను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

- ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించిన కె. రామకృష్ణారావు
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈనెల 18 తేదీ నుండి 23వ తేదీ వరకు నిర్వహించే యువజన, క్రీడా, పర్యాటక వారోత్సవాలను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మే 18 నుండి 23 వ తేదీ వరకు నిర్వహించే కార్యక్రమాల నిర్వహణపై స్పెషల్ సీఎస్ లు జయేష్ రంజన్, వాణి ప్రసాద్ లతో కలసి శనివారం డాక్టర్ బీఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈసందర్భంగా రామకృష్ణారావు మాట్లాడుతూ.. యువతలో క్రీడా స్ఫూర్తి, దేహదారుఢ్యం, సామాజిక చైతన్యం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకై ఈ కార్యక్రమాలను చేపట్టినట్టు తెలిపారు. పర్యాటక ప్రాంతాలపై ప్రజల్లో పెద్ద ఎత్తున చైతన్యం కల్పించాలని, పర్యాటక ప్రాంతాలను ప్రజలు సందర్శించేలా తగు చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. ప్రధానంగా స్పోర్ట్స్ కార్యక్రమాలను రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో నిర్వహించాలని, ప్రతీ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు, యువజన సంఘాలను భాగస్వామ్యం చేయాలని సీఎస్ సూచించారు. ఈనెల 18న నిర్వహించే ఫిట్- తెలంగాణా థీమ్ తో రాష్ట్ర, జిల్లా కేంద్రాలలో 5కే రన్, అన్ని మండల కేంద్రాలలో వాకథాన్, యోగ తదితర కార్యక్రమాలను నిర్వహించాలని ఆయన తెలిపారు. తెలంగాణలో పర్యాటక రంగానికి ఉన్న అపారమైన అవకాశాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఈ వారోత్సవాలు దోహదపడతాయని, దీనిలో భాగంగా ఈ వారం రోజులు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని అన్ని మ్యూజియంలలో ఉచిత ప్రవేశం కల్పించనున్నట్టు సీఎస్ వెల్లడించారు.
ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష
జిల్లాల్లో కొనసాగుతున్నధాన్యం కొనుగోళ్లపై కూడా జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సీఎస్ రామకృష్ణారావు సమీక్షించారు. సీఎం ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోళ్లలో ఎక్కడ జాప్యం లేకుండా, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆయన ఆదేశించారు.






