- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ సీపీగెట్- 2025 నోటిఫికేషన్ విడుదల
రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో పీజీ, 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ సీపీగెట్ 2025 పరీక్షకు

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో పీజీ, 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ సీపీగెట్ 2025 పరీక్షకు అర్హులైన విద్యార్థులు ఈ నెల 18 నుంచి జులై 17 వరకు ఆన్ లైన్ లో ధరఖాస్తు చేసుకోవచ్చని టీజీ సీపీగెట్ క్వనీనర్ ప్రొ.ఐ.పాండురంగారెడ్డి తెలిపారు. రూ. 500 లేట్ ఫీజుతో జులై 24 వరకు, రూ. 2000 ఆలస్య రుసుముతో జులై 28 వరకు ధరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. సీపీ గెట్ ప్రవేశ పరీక్షలను ఆగస్టు మొదటి వారంలో నిర్వహించేందుకు అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం టీజీ సీపీగెట్ 2025నోటిఫికేషన్ ను మాసబ్ ట్యాంక్ లోని తెలంగాణ ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్, ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా టీజీసీహెచ్ఈ ఛైర్మన్ బాలకిష్టా రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో 46,742 సీట్లు అందుబాటులో ఉన్నాయని, పలు కోర్సుల వివరాలను వెల్లడించారు.
టీజీ సీపీగెట్-2024లో మొత్తం సీట్లలో 74% బాలికలు భర్తీ చేశారని ఆయన తెలిపారు. సీపీగెట్ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, వీరనారి చాకలి ఐలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ , జేఎన్టీయూహెచ్ యూనివర్శిటీల్లో పీజీ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ పరీక్షను ఉస్మానియా యూనివర్శిటీ నిర్వహిస్తోంది. ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొ. కుమార్ మొలుగురామ్ మాట్లాడుతూ సీపీగెట్ నిర్వహణలో ఉస్మానియా యూనివర్సిటీ చేసిన కృషిని కొనియాడారు. హైదరాబాద్ నగరం దేశవ్యాప్తంగా విద్యా కేంద్రంగా మారుతోందని, ఇతర రాష్ట్రాల విద్యార్థులకు (తెలంగాణేతరులకు) 20 శాతం మంది విద్యార్థులకు వసతి కల్పిస్తున్నట్లు తెలిపారు. టీజీసీపీగెట్ -2025 కన్వీనర్ ప్రొ. ఐ. పాండురంగా రెడ్డి మాట్లాడుతూ, ప్రవేశ పరీక్షల సజావుగా నిర్వహించేందుకు అందుబాటులో ఉన్న పరీక్షా కేంద్రాల గురించి వివరించారు. పరీక్షలు రాసిన విద్యార్థులు అడ్మిషన్ల ప్రక్రియలో ఆలస్యం జరగకుండా అన్ని సర్టిఫికెట్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. సీపీగెట్ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు www.osmania.ac.in, www.ouadmissions.com, www.cpget.tsche.ac.in వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.






