Telangana Congress: అతనికి పార్టీతో సంబంధం లేదు.. ఎలాంటి పదవి కూడా లేదు

by Gantepaka Srikanth |

జూబ్లీహిల్స్‌(Jubilee Hills)తో పాటు రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ(Telangana Congress)కి చెందిన సైదులు అనే వ్యక్తి సర్వే చేయించాడని.. ఈ సర్వేల్లో పార్టీ పరిస్థితి, ప్రభుత్వ పనితీరు బాగా లేదని తేలినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.

Telangana Congress: అతనికి పార్టీతో సంబంధం లేదు.. ఎలాంటి పదవి కూడా లేదు
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్‌(Jubilee Hills)తో పాటు రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ(Telangana Congress)కి చెందిన సైదులు అనే వ్యక్తి సర్వే చేయించాడని.. ఈ సర్వేల్లో పార్టీ పరిస్థితి, ప్రభుత్వ పనితీరు బాగా లేదని తేలినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సర్వేలపై, సైదుల అనే వ్యక్తిపై తెలంగాణ కాంగ్రెస్ మీడియా కమ్యూనికేషన్ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి(Sama Rammohan Reddy) స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఎలాంటి సర్వేలు నిర్వహించలేదు. మాకు ఎలాంటి సర్వేలు, స్ట్రాటజిస్ట్‌లు అవసరం లేదు. మాకు కార్యకర్తలే స్ట్రాటజిస్టులు. సైదులు అనే వ్యక్తికి కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదు. అతనికి పార్టీలో కూడా ఎలాంటి పదవి లేదు. కనీసం ఆయనకి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కూడా లేదు. ఆయన సొంతగా సర్వేలు చేస్తున్నానని కాంగ్రెస్ నాయకులకు దగ్గరయ్యే ప్రయత్నం గతంలో చేశాడు. ఆయా సందర్భాల్లో దిగిన ఫొటోలను ఇప్పుడు అసందర్భంగా వాడుతూ తప్పుడు ప్రచారం చేసుకుంటున్నాడు. బీఆర్ఎస్ నేతల నుండి డబ్బులు తీసుకొని కాంగ్రెస్‌కు వ్యతిరేక ప్రచారం చేస్తున్న వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు, మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం’ అని సామా రామ్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Next Story