- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sampath Kumar: మళ్లీ అధికారంలోకి రావాలంటే ప్రక్షాళన మస్ట్
ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల తర్వాత కూడా జూబ్లీహిల్స్ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించిన ఈ సమయంలో పార్టీ, ప్రభుత్వంలో నేతల పనితీరు ఆధారంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ స్పష్టం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల తర్వాత కూడా జూబ్లీహిల్స్ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించిన ఈ సమయంలో పార్టీ, ప్రభుత్వంలో నేతల పనితీరు ఆధారంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ స్పష్టం చేశారు. మళ్లీ అధికారంలోకి పార్టీ రావాలంటే ఈ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతో ఉంది..ఎన్ఎస్‌యూఐ కార్యకర్త నుంచి ఏఐసీసీ వరకు.. ఎమ్మెల్యేగా పని చేసిన అనుభవంతో సీఎం రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్ లకు విజ్ఞప్తి చేస్తున్నా.. అక్కడక్కడ కొన్ని కలుపు మొక్కలు, గంజాయి మొక్కలు ఉన్నాయి..వాటిని ఏరిపారేయాలి.. మళ్లీ మొలకెత్తకుండా నలిపివేయాల్సి అవసరం ఉందని ఆయన సంచలన కామెంట్లు చేశారు. ఆదివారం గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో సంపత్కుమార్మాట్లాడుతూ నా పనితీరును కూడా సమీక్షించాలని, తనకు సీఎం, మీనాక్షి నటరాజన్‌లు గంట సమయం ఇస్తే ఆదిలాబాద్‌నుంచి అలంపూర్ వరకూ జహీరాబాద్‌నుంచి భద్రాచలం వరకూ నాకున్న సమాచారాన్ని వారికి తెలియజేస్తానన్నారు.
గత ఎన్నికలకు ముందు రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌గా ఉన్న సమయంలో ప్రభంజనంలో గెలుస్తామని పార్టీలోకి ఉప్పెనలా వచ్చిన వారు, అధికారంలోకి వస్తామని వచ్చిన వాళ్లు ఉన్నారని సంపత్కుమార్అన్నారు. రాబోయే మూడేండ్ల తర్వాత అప్పుడున్న పరిస్థితులతో ఎవరు ఎక్కడ ఉంటారో తెలియదని, 42లక్షల మంది శుశిక్షితులైన కార్యకర్తల బలమున్న పార్టీలో ప్రక్షాళన జరిగితేనే సమర్ధులకు, పనిచేసే వారికి ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుందన్నారు. తానైతే నిబద్దత కలిగిన కార్యకర్తగా చివరి వరకూ పార్టీలోనే ఉంటానని, కానీ మిగతా నేతలను పనితీరును పున:పరిశీలించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరి పనితీరును పునఃపరిశీలించి ప్రక్షాళన చేయాలని కోరుతున్నానని సంపత్ కుమార్ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించామని ఏమాత్రం అదమరిచి వ్యవహరించినా ఆగమైపోతామని, రాబోయే మూడెళ్లలో చివరి ఏడాది ఎన్నికల హాడావిడి ఉంటున్నందున ఈ రెండేళ్లలో పార్టీ, ప్రభుత్వం ప్రజల్లోకి మరింతగా వెళ్లాలంటే ఈ పునర్మిర్మాణ కార్యక్రమం అత్యంత అవరసరమని సంపత్‌కుమార్ అభిప్రాయపడ్డారు. మంచి వాతారణం ఉన్నప్పుడే రిపేరు చేస్తే లోటుపాట్లు ఏమైనా ఉంటే సర్ధుకుంటాయని, పరిస్థితులు బాగా లేనప్పుడు మేలుకుంటే లాభం ఉండదన్నారు.






