ఆయనకు మంత్రి పదవి ఖాయం.. కాంగ్రెస్ MLA హాట్ కామెంట్స్

by Gantepaka Srikanth |

జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి(Janampalli Anirudh Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆయనకు మంత్రి పదవి ఖాయం.. కాంగ్రెస్ MLA హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి(Janampalli Anirudh Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy)తో విభేదాలపై క్లారిటీ ఇచ్చారు. రెవెన్యూ మంత్రి పొంగులేటితో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. రెవెన్యూ శాఖ(Department of Revenue)తో మాత్రమే గొడవలు ఉన్నాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాన్‌హటన్ భూమి ప్రభుత్వానిదే అన్నారు. ఆ భూమిని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నెల్లూరుకు చెందిన వ్యక్తికి కేటాయిచారని తెలిపారు. అంతేకాదు.. త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుగబోతోందని.. అందులో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి(Vakiti Srihari)కి మంత్రి పదవి రావడం ఖాయమని హాట్ కామెంట్స్ చేశారు. ఈ విషయాన్ని ఏడాది క్రితం నారాయణపేట బహిరంగ సభలో చెప్పారని గుర్తుచేశారు.


ఇదిలా ఉండగా.. గతంలోనూ అనిరుధ్ రెడ్డి(Anirudh Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రాతో రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తున్నదని, ఒకవైపు హైడ్రా పేరుతో నోటీసులు ఇస్తారని.. మరోవైపు వాటిపై చర్యలుండవని ఆయన మండిపడ్డారు. మాన్‌హటన్ భూ వివాదంపై ఫిర్యాదు చేయడానికి హైడ్రా కార్యాలయానికి వెళ్లానని.. నా ఫిర్యాదు స్వీకరించినట్టు రశీదు ఇవ్వాలని హైడ్రా(Hydraa) సిబ్బందిని అడిగితే ఇవ్వలేదని చెప్పారు. పైగా వారు రశీదు ఇవ్వలేమని తనతో చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. రశీదు ఇవ్వకపోతే ఫిర్యాదుపై చర్యలు తీసుకున్నారో.. లేదో ఎలా తెలుస్తుంది? అని ప్రశ్నించారు. ఇదే విషయమై స్వయంగా హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌(Ranganath)కు ఫోన్‌ చేస్తే ఆయన లిఫ్టు చేయలేదు.. ఎమ్మెల్యేగా ఉన్న నా ఫోన్‌నే ఆయన లిఫ్ట్ చేయకుంటే ప్రజల సమస్యలు ఎలా పట్టించుకుంటారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Next Story