TG: యథావిధిగా కాంగ్రెస్ పాదయాత్ర

by Gantepaka Srikanth |   (  Updated:2025-07-30 09:28:47  IST  )

జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమావేశం అయ్యారు.

TG: యథావిధిగా కాంగ్రెస్ పాదయాత్ర
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమావేశం అయ్యారు. పార్టీ నిర్మాణం, పాదయాత్ర, బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీలో పోరాట కార్యాచరణపై చర్చించారు. దాదాపు గంటన్నరపాటు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ నెల 31 నుంచి వచ్చే నెల 4 వరకు యథావిధిగా కాంగ్రెస్(Telangana Congress) పాదయాత్ర కొనసాగుతుందని చెప్పారు. ఆగస్టు 5, 6, 7 మూడ్రోజుల పాటు 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుల ఆమోదం కోసం ఢిల్లీలో ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆగస్టు 5న పార్లమెంటు ఉభయ సభల్లో ఎంపీల వాయిదా తీర్మానం, చర్చకు పట్టుబడతారని అన్నారు. 6న జంతర్ మంతర్ వద్ద ధర్నా ఉంటుందని తెలిపారు. ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకత్వం, బీసీ సంఘాల నాయకులు పాల్గొనున్నారు. 7న రాష్ట్రపతికి వినతిపత్రం అందజేయనున్నారు. ఢిల్లీ టూర్ అనంతరం యథావిధిగా కాంగ్రెస్ పాదయాత్ర కొనసాగనున్నది.

Next Story