మంత్రి నిరంజన్ రెడ్డిని కలిసిన టీ-కాంగ్రెస్ నేతలు.. ఎందుకంటే?

by Disha Web Desk 2 |
మంత్రి నిరంజన్ రెడ్డిని కలిసిన టీ-కాంగ్రెస్ నేతలు.. ఎందుకంటే?
X

దిశ, తెలంగాణ బ్యూరో: గత మూడు రోజుల నుండి కురుస్తున్న భారీ వడగళ్ల వాన కి భారీగా పంట నష్టం జరిగిందని, వెంటనే నష్టపోయినా రైతులను అదుకోవాలని కాంగ్రెస్​పార్టీ ప్రభుత్వాన్నికోరింది. ఈ మేరకు మినిస్టర్స్ క్వాటర్స్‌లో ఆదివారం వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డిని కాంగ్రెస్ జాతీయ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, మాజీ ఎంపీ విహెచ్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ కలసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ... పంట నష్టపరిహారం కింద వరికి ఎకరానికి రూ.12వేలు ,మామిడికి రూ.50 వేలు చొప్పున ఇవ్వాలన్నారు.దీంతో పాటు కూరగాయలకు, ఆకు కూరలకు ఎకరానికి రూ.35వేలు,మక్కజొన్న కు రూ.15వేలు,కోళ్ల ఫారాలు, డైరీ ఫారాలకు వడ్డీ మాఫీ చేయాలన్నారు. ధాన సబ్సిడీ లను కూడా ఇవ్వాలన్నారు. మరోవైపు షెడ్ల పున్నరినిర్మాణానికి ఆర్ధిక సహాయం చేయాలన్నారు. అంతేగాక పూర్తిగా నష్టపోయిన రేకుల తో కట్టిన ఇండ్లకు రూ 5 లక్షలు పరిహారం ఇవ్వాలని కోరారు. కూలిన ఇండ్లకూ సాయం అందించాలని జగ్గారెడ్డి కోరారు.


Next Story

Most Viewed