బిహార్ సీఎం నితీష్‌‌పై తెలంగాణ నేత ఈసీకి కంప్లైంట్

by Gantepaka Srikanth |

బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజ్యసభకు నామినేషన్ వేసిన విషయం తెలిసిందే.

బిహార్ సీఎం నితీష్‌‌పై తెలంగాణ నేత ఈసీకి కంప్లైంట్
X

దిశ, వెబ్‌డెస్క్: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజ్యసభకు నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. గురువారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో రాజ్యసభ ఎన్నిక కోసం నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. దీంతో నితీష్ రాష్ట్ర రాజకీయాలను వదిలి, కేంద్ర రాజకీయాల్లో అడుగు పెట్టడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే.. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై కేంద్ర ఎన్నికల సంఘానికి టీపీసీసీ ఎలక్షన్ కమిషన్ కో-ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ పులిపాటి రాజేష్ కుమార్ ఫిర్యాదు చేశారు. నితీష్ కుమార్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

‘బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఇవాళ రాజ్యసభకు నామినేషన్ వేశారు. నిబంధనలకు విరుద్ధంగా కేంద్రమంత్రి అమిత్ షా సమక్షంలో నలుగురు(4) కన్నా ఎక్కువ మందిని తమ నామినేషన్ పత్రాలు సమర్పించడానికి రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫీస్‌కి వెళ్లారు. ఇది ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు విరుద్ధం. తక్షణమే దీనిపై విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి’ అని కేంద్ర ఎన్నికల సంఘానికి పులిపాటి రాజేష్ కుమార్ ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు.

Next Story